భూదేవి రక్షాబంధన్

భూదేవి రక్షాబంధన్

భూదేవి రక్షాబంధన్

రాధ తన నాలుగేళ్ల మల్లికని చంకనెత్తుకుని మారాం చేస్తూ, అన్నం తినడానికి పేచీ పడుతోందని గ్రహించింది. ఆ రోజు పౌర్ణమి వలన పిండి ఆరబోసినట్లు ఉంది. ఆ వెన్నెలలో చందమామను చూపిస్తూ,
అదిగో చందమామను చూశావా? చందమామ మనకందరికీ మామ. ఎందుకో తెలుసా? చందమామ మనకందరకు చల్లదనాన్ని ఇచ్చి, ఆనందాన్ని ఇస్తుంది.

చందమామ గురించి పేదరాశిపెద్దమ్మ కథలు చెప్పుకునేవాళ్ళం అది వరకు. కానీ ఇప్పుడు ఆ చందమామను మనం కళ్ళారా చూడగలిగాం మన ఇస్రో శాస్త్ర వేత్త పుణ్యమా అని అంది రాధ. అవునమ్మా, మా టీచర్ కూడా చెప్పింది చందమామ గురించి. నువ్వు ఇంకొంచెం విపులంగా చెప్పమ్మా అంది మల్లిక.

ఆ చిన్న మనసులో అంత మంచి ఆలోచన రావటం తో చాలా సంతోషపడి, చందమామ గురించి చెప్పటం మొదలు పెట్టింది. చంద్రయాన్ – 3 అనే రాకెట్ తో రోదసీలో ప్రయాణించే చందమామ ని చేరే ప్రయత్నం చేసి, కృతకృత్యులయ్యారు మన ఇస్రో శాస్త్రవేత్తలు.

మనకందరకు చందమామను దగ్గర నుండి చూసే భాగ్యం కల్పించారు. చందమామకి దక్షిణ ధృవం పై మన రోదసి నడకను లాంగ్ చేసి చందమామలో ఉన్న వాతావరణం, నీటి వసతులు, మానవులు ఇక్కడ నివసించే ఏమైనా అవకాశం ఉందా అనే వాటి మీద పరిశోధన చేద్దామనుకుంటున్నారు అంది రాధ.

మల్లిక చాలా ఇంట్రస్ట్ గా వింటోంది. ఇప్పటికి ఇది చాలు. నువ్వు ఇంకొంచం పెద్దయ్యాక మిగిలిన విషయాలు చెబుతాను. 

నీకు ఇంకో కొత్త విషయం చెబుతాను. మనం భూదేవిని అమ్మ అనుకుంటాం కదా. ఇస్రో శాస్త్రవేత్తలు రాబోయే శ్రావణ పౌర్ణమి కి రాఖీ పంపించారు చందమామకి నీకు తెలుసా. అందుకే మనకందరికీ మామ అయ్యాడు చందమామ. భూదేవి నుంచి వచ్చిన రాఖీ కట్టించుకని,రక్షాబంధన్ చూసి ఎంత మురుసుకుంటున్నాడో తెలుసా. అందుకే చందమామ ఇంత నవ్వుతూ ఈ పౌర్ణమి రోజున ఇంత వెన్నెల కురిపిస్తూ, భూలోక వాసుల మీద ప్రేమ చూపిస్తున్నాడు అంది రాధ.

నేను అన్నకి రక్షాబంధన్ కట్టినట్లు భూమాత చందమామయ్యకి రక్షాబంధన్ కట్టిందా వావ్ ఏ సర్ప్రైజ్ ఊహ? బాగుందమ్మా అంటూ గిన్నెలో బువ్వ ఖాళీ చేసి రాధ చంక దిగింది మల్లిక. 

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

అందరికీ అన్నయ్య Previous post అందరికీ అన్నయ్య
రక్షాబంధన్ Next post రక్షాబంధన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close