బ్రతుకు పోరు

బ్రతుకు పోరు

కనులకు కునుకు చేరదు..
కాళ్ళు ముడుచుకుని..

డొక్కలెండిన శరీరాలకు..
బ్రతుకుపోరు వినపడదు..
బ్రతికే ఆరాటంలో చివరి వరకూ

చిరునామాగా మిగిలిపోయే
జీవాత్మల అనుసంధానం
తానని చెప్పదు..
తనను దాటి వెళ్ళే
దారి చూపదు..
విడిచిపోదు.. మరచిపోనీదు..!!

– భాను శ్రీమేఘన

Related Posts