నవ్వుల రాజు
అక్షర హాస్య సాహితీ పోటీ కొరకుఅంశం - చిత్ర కవితరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - నవ్వుల రాజు నవ్వులు పండిస్తాడుఎక్కడ ఉన్నా అక్కడనవ్వులే కురిపిస్తాడుచూడగానే ఆకర్షిస్తాడు! చెంపల పై ఎరుపుఅతని ముక్కు చెర్రీపండు కళ్లు చురుకుగా పెదవుల పై నవ్వు! జోకర్ గా వెలుగుతున్నఅతని అంతరంగం లోఎన్ని బాధలో అవేవీతెలియకుండా నవ్వులేముఖం నిండా! నవ్వుల రా రాజతడుఎల్లప్పుడు నవ్వుతుండుఇతరులను నవ్విస్తు ఉండుమది లోపల వ్యధలెన్నోరగులుతు ఉండు! మనసున్న మహారాజుమమతల నే పంచు రాజుపది మందితో చెలిమి ఉండుఅతడెక్కడ ఉంటే అక్కడేనవ్వుల పంట పండుచుండు! ఇది నా స్వీయ రచన..