జనం
జనం జనంతోనే జీవితాలు ముడిపడివున్నవిమనిషి జీవనయాత్ర రకరకాల మజిలీలతో సంపూర్తివివేకవంతుడు అనుభవాల నేపథ్యంలో గమ్యం చేరుతాడుమూర్ఖుడు కఠినమైన పరీక్షలకు లోనై వైఫల్యం చెందుతాడుజీవితం పూచిన వెన్నెల శ్రమైక్య విజ్ఞానికివీణను మీటితే సంగీత స్రవంతులు హృదయాన్ని మీటితే నవజీవన స్రవంతులుజీవితంలో వెలుగుల జ్యోతులు జ్ఞాన తృష్ణ జ్వలిస్తుంటేప్రతి జీవితం పండువెన్నెల పూర్ణకుంభం జనచైతన్యోణ్ముఖునికిజనజీవితాలు ఉజ్వల ప్రగతి పథంలో పయనించేది చైతన్య శ్రమలతోనేమనిషికి మనిషికి మధ్య బంధం ఇరు హృదయాల అనుబంధంలొనేనాయకుడు తన కార్యసాఫల్యతకు సామాజిక ప్రయోజనాలకు జనాన్ని కూడదీసుకుంటాడుమనిషనేవాడు మన్వంతరాల నుండి మారుతూ రూపుదిద్దుకున్న సజీవ శిల్పంమనిషి జఠిలమైన సమస్యలను కుశాగ్రబుద్దితోనే పరిష్కరించగలడువిద్య విజ్ఞానం మనిషిని మరోప్రపంచం రూపసిగా నిలబెడుతుంది అపరాజిత్సూర్యాపేట