నీ మనస్సు శరీరం విడిచే జాడ్యాలు,,,,
నీలో నీవు ఒంటరివైనీకై నీవు దివ్యానుభూతిలోప్రతి సాయం సంధ్యరోజువారి బాదరాబంధీలుజీవితం అగచాట్లు ,వైఫల్యాలు, వికారాలుకళ్ళు మూసుకుని సుఖాసనంలోమనస్సు శరీరం తేలికవుతూనిగూఢ ధ్యానస్థితిలోకి వెళ్ళిపొద్దస్తమానం బడలికను గుర్తుచేసుకునిశరీరంనుండి, మనస్సునుండివేదన సంవేదనలు ఒకటొకటిగాశరీరంనుండి మనస్సునుండి వీడిపోనీయ్మనస్సు పొరలు విచ్చుకునిమౌనియై చెడు ఆలోచనలుచేదు జ్ఞాపకాలను వదిలేయ్నీ మనస్సు పుటల నిండాకోరికల సుడిగుండాలనుఒకటొకటిగా శరీరం మనస్సుఒకటిచేసి నీవో శిలలానీ వికారాలను ఆత్మ న్యూనతలనునెమ్మదిగా అతి నెమ్మదిగానీనుంచి వదిలిపోయే అజ్ఞాన జాడ్యాలునిన్ను క్రుంగదీస్తున్న భావనలుఅవమానాలను అవహేళనలుసాక్షీభూతంగా గ్రహిస్తూ వదిలేయ్కోపతాపాల నీలో చెలరేగే మంటలనువీడిపోతున్న క్షణాలుఅవ్యక్త దివ్యానుభూతిలోమనస్సులో ఎన్నడూ చూడని ప్రశాంతతశరీరమంతా ధూళి విడిపోతూ దూదియై తేలికయైనెమ్మదిగా అతినెమ్మదిగా పూర్వస్థితిలోకి వస్తేఆ అవ్యక్తానందం భావనాతీతం వర్ణనాతీతంప్రశాంత చిత్తునివై ఆ సాయంత్రంపడమట అస్తమిస్తున్న ఎర్రని సూరీడునిఅలా తదేకంగా చూస్తూ దివ్యానందంలోనీ జీవితంలోకి వెలుగుల పరంజ్యోతిని ఆహ్వానిస్తున్న ఆత్మజ్ఞానం అపరాజిత్సూర్యాపేట