నిజ జీవితంలో మనుష్యుల్లో మృగమనుసుష్యులు ఉన్నారు. వీళ్ళు ప్రతిచోట దర్శనమిస్తారు.కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, రకరకాల వ్యాపకాలలో లౌక్యం తెలియని సజ్జనులను ,దుర్మార్గంగా అణచివేయడమే వీళ్ళ వికృతానందం. మనం వీళ్ళతో సున్నితంగా డీల్ చేసి దూరం పెట్టాలి లేదా వీళ్ళ బారీనుండి వైదొలగాలి. లేదంటే వికృతానందానికి బలి కావలసి వస్తుంది.అపరాజిత్సూర్యాపేట
దీర్ఘకాలంగా లక్షల కన్నీటి చుక్కలు తీర్చలేని దుఃఖిత వ్యధ. అక్షరాల పూవులు సృజించిన చమక్కుమనే లేక చురుక్కుమనే ఆలోచన జీవితాన్ని సమగ్రంగా మార్చేందుకు సూదంటురాయి లాంటి అవలోకనం, అంతర్ముఖం ---దారిచూపే జిజ్ఞాస స్ఫురిస్తుంది. ఆమలుచేయడమే నీ తక్షణ కర్తవ్యం.అపరాజిత్సూర్యాపేట
అక్షర సమూహంఅంశం: చిత్రకవితశీర్షిక :కాలానికి కొలమానం మానవ మేథ,,,,,,,,,!!రచయిత ; అపరాజిత్ రెడ్డి ఈ అనంత కాలం రెక్కలు తొడిగిఇలాగే గతించిపోతుంది కాబోలుఈ ప్రభాతాలు ,ఈ సాయం సంధ్యలుఉపిరిపోసుకుంటున్న ధరిత్రి పగళ్ళు ,రాత్రుళ్ళుతేలిపోతున్న మబ్బుల్లా సమస్యల సుడిగుండాలుకాలం దివారాత్రులు కదలి కదలి కళ్ళు మూసి తెరిచేంతలోనే మటుమాయం,,,,,,,,,,,,,,ఈ చైత్రాలు ,ఉగాదులు కాలం కొలబద్దలనుకుంటే పొరపాటు,,,,,,,గ్రహాలను ఏ శిల్పి ఉలితో చెక్కలేదు నిర్దిష్టముగా నీ భవిష్యత్తు రహస్యాలను గణించి చెప్పడానికి,,,,,,,,,,,,,ఊహలకు అందనిది కాలం పరుగులుపెడుతూ నిన్ను శైశవం నుండి సాకి సాకి ఆవల పారవేస్తూ గిర్రున తిరిగే కాలచక్రం ఈ భువికి,,,,,,,,,,,,,,,,,వెలుగుల సూరీడు చలిమంటలు రేపుతూ ఋతువుల మార్పుతో కాలం చూసుకునే గడియారం నీకై,,,,,,,,,,,వినీల గగణం ఆనంతానంత కోటిప్రభల రూపం కింద మానవుడు చరించే భూమి సృష్టికి అతీతమైన శక్తి ఎలా సృజియించబడిందో ఎవ్వరికీ తెలీదు,,,,,,,,,,,,,,,రాత్రి పూట నక్షత్రాలు ,చంద్రుడు వింత వింత అనుభూతులు ,అనుభవాల ప్రకృతి రమ్యమైన సుందర గోళం భూమి,,,,,,,,,,,,,,ఆకర్షణీయమైన…
ఈ దుర్ఘటనను భోపాల్ విపత్తు , భోపాల్ వాయు విషాదం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో గ్యాస్ లీక్ సంఘటనగా చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు. ఇది మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగుమందుల ప్లాంట్లో డిసెంబరు 2-3, 1984 రాత్రి పూట జరిగింది. 500,000 మందికిపైగా ప్రజలు మిథైల్ ఐసోసనియేట్ (MIC) వాయువు, ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56 వార్డులు ఉంటే- 36 వార్డుల్లో విషవాయువు ప్రభావం చూపింది. మృతుల సంఖ్యపై అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది, అందులో 2,259 మంది తక్షణమరణానికి గురైనట్టుగా నిర్ధారించింది. 2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్లో గ్యాస్ లీకేజి వలన 558,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో…
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 3వ తేదీన నిర్వహించబడుతుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా వికలాంగులు ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది. వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.వికలాంగులకు సమాన అవకాశాలు, హక్కులు కలిపించి వారందరిని సమాజ అభివృద్ధిలో భాగం చేయాలనే లక్ష్యంతో 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం గా ప్రకటించింది. అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది. ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. కాలిబర్, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు వంటివి బహుకరిస్తారు.వివిధ పాఠశాలలోని వికలాంగ…
✒ 1992: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. ✒1884: మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జననం (మ.1963). ✒1889: భారత స్వాతంత్ర్యోద్యమకారుడు ఖుదీరామ్ బోస్ జననం (మ.1908). ✒1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం. ✒1979: ప్రసిద్ధ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ మరణం (జ.1905). ✒1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు. ✒2011: ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు దేవానంద్ మరణం (జ.1923). మాధవి కాళ్లసేకరణ
అక్షర కొరకు🌷అంశే చిత్రకవితతేదీ3/12/25శీర్షిక- ఆవలి తీరండా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉ఆకాశం గులాబీ వెలుగులతో విరబూసిన వేళ,మబ్బుల్లో నిలిచిన ఒంటరి రూపం కనిపించింది,నిశ్శబ్దం గాలిలో ఒరిగిపోతూ అలుముకుంది,మనసు ఆ వెలుతురులో ఏదో వెతికింది,ముందున్న మార్గం మసకలో కప్పుకుంది, అడుగులు మాత్రం వెనుకడుగు లేక సాగాయి,గత జ్ఞాపకాలు ఆకాశపు గీతల్లో లీనమయ్యాయి,చిన్న ఆశ మృదువుగా హృదయంపై తాకింది,దూరంలో మెరుస్తున్న వెలుగు మనసును పిలిచింది,నీడ తనతో పాటు నిశ్శబ్దంగా నడిచింది, గాలి చెవికి రహస్యంగా ఏదో చెప్పింది,మబ్బుల మడుల్లో దాచుకున్న బాధ బయటికి వచ్చింది,అదే బాధ కన్నీటిగా కాదు ధైర్యంగా మారింది,వెలుగు రేఖలు మనసును తిరిగి నిలబెట్టాయి,పాదాల కింద మంచు మెల్లగా కరుగుతూ వెళ్లింది, ప్రతి ఊపిరిలో ఒక కొత్త నమ్మకం మొలిచింది,ఆకాశం రంగులు హృదయంపై పులుముకున్నాయి,ఒంటరితనంలోనూ ఓ వెచ్చదనం పుట్టింది,గతం నెమ్మదిగా దూరానికి నడిచిపోయింది,భవిష్యత్తు చిరు చిరు వెలుగులతో చిరునవ్వింది, మనసు ఆ వెలుగును అందుకునేందుకు ముందుకెళ్లింది,పరుచుకున్న నిశ్శబ్దం ఇప్పుడు సంగీతమైంది,ఆ రూపం ఆకాశాన్ని తాకే ఆకాంక్షగా…
అక్షర సమూహంఅంశం : చిత్రకవితశీర్షిక :మనస్సు కోల్పోయిన స్వప్నాలురచయిత : అపరాజిత్ రెడ్డి నాకై నేను గోరీ కట్టుకుని మనిషి నయ్యానుఈ వృద్దాప్యంలో పుంసత్వం లేని పురుషోత్తముణ్ణిగాడితప్పిన జీవితం చరమాంకం ఓ పగిలిన అద్దంతలారి ఉరికంభం తాడుకు వేలాడుతున్న శరీరాన్నిదిగంతాల కావల దాకా వినిపించేలా రోదించినా పట్టించుకోని లోకంచెద చీమలు తింటున్న మనస్సు అగ్నికూపంఆలోచనల అలజడితో అలసి విసిగి విరిగిపోతున్న మనస్సుమనస్సు నిండా మండుటెండల ఎడారి మబ్బులువయస్సు ముదిరిన రోగి కళ్ళు గతం తాలూకు విషాద స్వప్నాలుఎటు చూసినా కారుచీకట్లు కమ్ముకొస్తున్న మనస్సు గుహనిప్పులు కక్కే ఎండల్లో ఎండమావులలో నీటి కోసం పరుగులురక్తం చచ్చి పాలిపోయిన శరీరాన్ని మోస్తూ ఇంకెన్నాళ్ళుఆలోచనల తీవ్రతతో పగిలిపోతూ వడలిపోతున్న మనస్సుఈ అక్షరాలు ఇలా లిఖిస్తూపోతే శృతితప్పిన రాగాలన్నీ బయటికి వస్తాయి,,ఎంత మనోహరమైన గీతాలు లిఖిద్దామన్నా విషాద జీవితమే కలం రాస్తోందిహృదయం ముక్కలైన బోటి పడవ కదలదు కదారాగాలు పోయే గొంతు రోగగ్రస్తమై మూగబోతోందిమాయామర్మం తెలియక బ్రతికిన…
అక్షర కొరకుఅంశం :- చిత్ర కథతేది:- 02/12/2025శీర్షిక:- కల్పనను సృష్టించిన తపన రాఘవయ్య తన డ్రెస్సింగ్ టేబుల్ పైన, ముసలితనపు ఛాయలతో, మధ్యాహ్నం భోజనం ముందు కూర్చున్నాడు. గిన్నెలో స్పూన్ ఉంది. కానీ , అతడి కళ్ళు మాత్రం అరచేతిలో దాగి ఉన్నాయి. ఆ గదిలో దట్టమైన నిశ్శబ్దం ఉంది. అతడి కళ్ళద్దాలు, మందులు పక్కనే ఉన్నాయి. అతడు కేవలం శరీరంలో మాత్రమే బతికున్నాడు, మనసు గతంలోని జ్ఞాపకాలలో, తీరని విరహంలో చిక్కుకుంది. ఆయన బాధ, ఆకలిని కూడా మరిపించేంత లోతైనది.ఆ జ్ఞాపకాల లోతుకు వెళ్తే… రాఘవయ్య (యుక్తవయసులో) ఒకప్పుడు ఎంతటి విరహాన్ని అనుభవించాడో తెలుస్తుంది. అతడు రాత్రి పూట పండు వెన్నెలలో ఒంటరిగా కూర్చునేవాడు. ఆకాశంలో చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నా, పక్షులు ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నా, అతడి మనసు మాత్రం తన ఊహల రాణి కోసం తపించేది.ఆ తపనే అతడిలోని కళాకారుడిని, కవిని మేల్కొల్పింది. అతడు తన ఒంటరితనాన్ని ఒక…