అనుభవాల సారం
అనుభవాల సారం లతలు లతలుగా పెనవేసుకుపోయే బంధాలుప్రాణం పోసుకుని నర్తనమాడే శిల్పాలుహృదయ లయల్లో ఏదో తెలియని సృజన స్వరూపంజీవితం సంధ్యాకాంతుల సహజ స్వరూపంచెలియ కన్నుల్లో వింత వింత వెలుగుల ఆలంబణలుజీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితిపదగతులు సుస్వరాలై గంధర్వ గానం మేల్కొలుపుఎటు చూసినా ఆనందాల హరివిల్లు సోయగాలువికసించిన పూవుల సుగంధాలు హృదయం నిండాజనజీవనంలో మమేకం కాకున్నా మూర్తీభవించిన వ్యక్తిత్వంసాఫీగా సాగిపోతున్న సంసారంలో అకస్మాత్తుగా ఏదో అలజడిఅయినా సర్దుకుపోయే నైజం జీవితం నేర్పిన గుణపాఠంఎన్నెన్ని ఇబ్బందులు ఉన్నా గుండెల్లో దాచుకుని మార్గదర్శనం చేసుకుంటూ వెళ్ళడమేమనస్సు లోయల్లో ఎన్ని గాయాలు ఉన్నా సౌందర్య శిఖరాలు దర్శించడమేచెలిమికి చెలియ లేకున్నా బాధ దిగమింగుకుని హృదయంలో ఆనందం పోసుకోవడమేవిధాత జీవితం ఎలా ఇచ్చినా మనకనుగుణంగా మలచుకోవడమేజన జీవనంలో వాస్తవం తెలుసుకుని సాగిపోవడమేపరిస్థితులను అర్థం చేసుకుని సాఫీగా జీవితం కొనసాగించడమేనిన్ను నిన్నుగా చూడలేని లోకం ఎన్నటికీ మారదు నీవే మారాలిధనం ఉన్నా లేకున్నా పొదుపుగా కుదురుగా జీవనం…