Blog

Your blog category

ఆకాశంలోకి జివ్వుమని జుమ్మంటూ ఎగురుతూ చుక్కల్ని తాకే దీపావళి రాకెట్ వెలుగుల చమక్కులు పుష్పిస్తూ ,అమావాస్య రాత్రి వెలుగుల మెరుపుల్లో చీకట్లను పారద్రోలుతూ ,విషాదపూరిత కళ్ళల్లో ఆశల నక్షత్రాలను పుష్పించే దీపావళి టపాసులు జీవనసోయగాలు,సహృదయత సంస్కృతి ,సంప్రదాయాలతో జీవితాలను అలరించే నవ్య వసంతాల దివ్యపరంజ్యోతి దీపావళి.వికృత మనస్సులలో కొంతవరకైనా క్రూర నరకాసుర వధలా హృదయాలలో వెలుగు పూవులు పూయాలని కోరుకుంటూ,,,,,,,,,అపరాజిత్

ఆకాశంలోకి జివ్వుమని జుమ్మంటూ ఎగురుతూ చుక్కల్ని తాకే దీపావళి రాకెట్ వెలుగుల చమక్కులు పుష్పిస్తూ ,అమావాస్య రాత్రి వెలుగుల మెరుపుల్లో చీకట్లను పారద్రోలుతూ ,విషాదపూరిత కళ్ళల్లో ఆశల నక్షత్రాలను పుష్పించే దీపావళి టపాసులు జీవనసోయగాలు,సహృదయత సంస్కృతి ,సంప్రదాయాలతో జీవితాలను అలరించే నవ్య వసంతాల దివ్యపరంజ్యోతి దీపావళి.వికృత మనస్సులలో కొంతవరకైనా క్రూర నరకాసుర వధలా హృదయాలలో వెలుగు పూవులు పూయాలని కోరుకుంటూ,,,,,,,,,అపరాజిత్

Read More
కంటి నిండా కలల కాంతులు..నోటి నిండా తీపి పదార్ధాలు..మనసు నిండా ఆనందాలు..హృదయం నిండా తీపి జ్ఞాపకాలు..

కంటి నిండా కలల కాంతులు..నోటి నిండా తీపి పదార్ధాలు..మనసు నిండా ఆనందాలు..హృదయం నిండా తీపి జ్ఞాపకాలు..

ఆకాశం నిండామతాబుల వెలుగులు..పొంగి పొరలుతూవెలుగులు చిమ్ముతూ.. సిరులతల్లి శ్రీ మహాలక్ష్మిమీ ఇంట కొలువై ఉండాలని ఆశిస్తూ.. నా ప్రియమైన మిత్రులకు ఆత్మీయులందరికీ.. దీపావళి శుభాకాంక్షలు.. మీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
దీపావళి పండుగ

దీపావళి పండుగ

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు…
Read More
అంతర్జాతీయ చెఫ్స్(వంటవారు)దినోత్సవం

అంతర్జాతీయ చెఫ్స్(వంటవారు)దినోత్సవం

ప్రతి సంవత్సరం అక్టోబర్ 20న, మేము అంతర్జాతీయ చెఫ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము, ఈ సంప్రదాయాన్ని 2004లో దివంగత చెఫ్ డాక్టర్ బిల్ గల్లాఘర్ స్థాపించారు, మా పాక వృత్తిని గౌరవించడానికి మరియు తరువాతి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు ఇది ఒక సంప్రదాయం. నెస్లే ప్రొఫెషనల్‌తో భాగస్వామ్యంతో వరల్డ్‌చెఫ్స్ ఈ సంవత్సరం ఉత్తేజకరమైన ప్రచారాన్ని మీకు అందించడానికి ఉత్సాహంగా ఉంది: ఫుడ్ ఎక్స్‌ప్లోరర్స్. పిల్లలను వంటల సాహసయాత్రకు ఆహ్వానించి, వంటలోని ఆనందాలను, ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను మరియు స్థిరమైన పద్ధతుల విలువను కనుగొంటుంది. తాజా, స్థానిక మరియు కాలానుగుణ పదార్థాలను అన్వేషించడం ద్వారా, మనం యువ మనస్సులలో ఉత్సుకత మరియు సృజనాత్మకతను రేకెత్తించవచ్చు, ఆహారం మరియు గ్రహం పట్ల వారి ప్రేమను పెంపొందించవచ్చు. కలిసి, మనం శాశ్వత ప్రభావాన్ని చూపగలము! ఆకర్షణీయమైన వర్క్‌షాప్‌లను నిర్వహించడం, జ్ఞానాన్ని పంచుకోవడం మరియు మీ కమ్యూనిటీలోని పిల్లలకు చిరస్మరణీయ అనుభవాలను సృష్టించడంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చెఫ్‌లతో…
Read More
ప్రపంచ ఆస్టియో పోరోసిస్

ప్రపంచ ఆస్టియో పోరోసిస్

ప్రతీయేటా అక్టోబర్ 20న ప్రపంచ ఆస్టియోపోరోసిస్ దినోత్సవంగా జరుపుకుంటాము. మోనోపాజ్ తరువాత మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) కూడా ఒకటి. దీనిలో ఎముక సాంద్రత తగ్గి, పటుత్వం కోల్పోయి అవి గుల్లబారతాయి. ఎముక గుల్లబారటం చాలా నెమ్మదిగా జరగటం వలన చాలా మందిలో ఎముకలు విరిగేంతవరకు ఎలాంటి లక్షణాలు కనబడవు. 2015లో WHO సర్వే ప్రకారం యాభై పైబడినవారిలో మన దేశంలో ప్రతీ ముగ్గురు స్త్రీలలో ఒకరు. ప్రతీ ఎనిమిది మంది మగవారిలో ఒకరు ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారు. సుమారుగా 2015 నాటికి 5 కోట్ల మంది ఈ వ్యాధికి లోనైయ్యారు. జీవనశైలిలో మార్పులు, పౌషకాహారం తీసుకోవడం, సరియైన వ్యాయామం చేయడం మరియు వ్యాధిని తొలిదశలో గుర్తించడం వలన ఆస్టియోపోరోసిస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సాధారణంగా ఎముక నిర్మాణం మరియు ఎదుగుదలలో భాగంగా ఎముకలోని పాతకణాలు పోయి కొత్తకణాలు చేరతాయి. దీన్ని ఎముక రిమాడలింగ్ (Bone…
Read More
ప్రపంచ గణాంక దినోత్సవం

ప్రపంచ గణాంక దినోత్సవం

ప్రపంచ గణాంకాల దినోత్సవం అనేది గణాంకాలను జరుపుకోవడానికి ఒక అంతర్జాతీయ దినోత్సవం . ఐక్యరాజ్యసమితి గణాంక కమిషన్ ద్వారా సృష్టించబడిన దీనిని మొదట 20 అక్టోబర్ 2010, 20-10-2010న జరుపుకున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. 2010 నాటికి , 103 దేశాలు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటాయి, వీటిలో 51 ఆఫ్రికన్ దేశాలు సంయుక్తంగా ఏటా నవంబర్ 18న ఆఫ్రికన్ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటాయి. భారతదేశం జూన్ 29న గణాంకవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ పుట్టినరోజున తన గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. UKలోని రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ కూడా అదే రోజు 20:10 గంటలకు (20 అక్టోబర్ 2010న) తన గెట్‌స్టాట్స్ గణాంక అక్షరాస్యత ప్రచారాన్ని ప్రారంభించింది. 2025 అక్టోబర్ 20 న , ప్రపంచం ఐక్యరాజ్యసమితి ప్రపంచ గణాంకాల దినోత్సవాన్ని (WSD) " ప్రతి ఒక్కరికీ నాణ్యమైన గణాంకాలు మరియు డేటాతో మార్పును నడిపించడం"…
Read More
అక్టోబర్ 20 ప్రత్యేకతలు :⁠-

అక్టోబర్ 20 ప్రత్యేకతలు :⁠-

1859: అమెరికన్ తత్వవేత్త, విద్యావేత్త జాన్ డ్యూయీ జననం (మ.1952). 1891: న్యూట్రాన్ కనుగొన్నందుకు భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్ జననం (మ.1974). 1927: ప్రముఖ కవి, విమర్శకుడు, గుంటూరు శేషేంద్ర శర్మ జననం (మ.2007). 1938: ఆంధ్రుల అభిమాన హాస్యనటుడు రాజబాబు జననం (మ.1983). 1947: ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది. 1956: ఆంగ్ల దర్శకుడు, నిర్మాత డానీ బాయిల్ జననం. 1963: భారతీయ క్రికెట్ మాజీ బ్యాట్స్‌మన్ నవజ్యోత్ సింగ్ సిద్దూ జననం. 1978: భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీరేంద్ర సెహ్వాగ్ జననం. 2010: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు పాగ పుల్లారెడ్డి మరణం (జ.1919). మాధవి కాళ్లసేకరణ
Read More
ప్రియమైన అందరికిశుభోదయం.నమస్కారాలు.

ప్రియమైన అందరికిశుభోదయం.నమస్కారాలు.

చిరు నవ్వుచాలదా….మనసు లోచీకటి నివెలిగించటానికిమానవవనంలో….వెన్నెలనింపటానికిఘనవిజయాలనుసాధించటానికి వెన్నలా….హృదయాలుకలిసిగుండెల్లోనినరకాన్నిచంపిస్వర్గాన్నిస్పర్శించిమానవత్వంపెంచటానికిమనిషీ…మంచిమనిషిచాలడా…. మనస్వినిరాగాల్లో….సొలసి పోతూఆనందంగా…కలిసిపోతూ… పెద్దలుపిన్నలుమిత్రులుప్రతి ఒక్కరికిహృదయ పూర్వకదీపావళి పండుగశుభాకాంక్షలు. మీఅల్లావుద్దీన్
Read More
నా చుట్టూర నీవు వెలిగించిన దీపంజ్యోతులు,నా గుండెల్లోని చీకట్ల విషాదం నా కళ్ళల్లో తెరలు తెరలుగా కదులుతూ నల్లగులాబీలై ఆకాశంలోకి తేలిపోతూ, ఆ జ్ఞానజ్యోతులలో హృదయం తెరుచుకుంటున్న అనుభూతి,,,,,, ,,,!!అపరాజిత్

నా చుట్టూర నీవు వెలిగించిన దీపంజ్యోతులు,నా గుండెల్లోని చీకట్ల విషాదం నా కళ్ళల్లో తెరలు తెరలుగా కదులుతూ నల్లగులాబీలై ఆకాశంలోకి తేలిపోతూ, ఆ జ్ఞానజ్యోతులలో హృదయం తెరుచుకుంటున్న అనుభూతి,,,,,, ,,,!!అపరాజిత్

Read More
పరంజ్యోతులు నా అక్షరాలు,,,,,,,,,!!

పరంజ్యోతులు నా అక్షరాలు,,,,,,,,,!!

ఇంటి ముంగిలిలో ముదితవెలిగిస్తూ అలంకరించె దివ్వెలుఆ దీపం జ్యోతులు పరమాత్మునివెలుగుల పరంజ్యోతులు,,,,,!!ఇంటిలో దివ్య వసంతాలుపూయించే దివ్యస్వరూపులురంజిళ్ళు కాంతుల్లో ఇంట్లోకష్టాల చీకట్లను పారద్రోలుకారుమబ్బుల నిశీధి జీవితాల్లోఇంటి ముందర కాంతుల దివ్వెలుగుండె గూడులోని గుబులుజిలుగు వెలుగుల్లో అంతర్థానమౌనుపరమాత్ముని దివ్యమంగళ శోభలోఆత్మలోని అమృతత్వం మేల్కొనుగుప్తంగా గుండెల్లోని దుఃఖంమటుమాయం దివ్యాక్షర జ్యోతుల్లోహృదయం నిర్మలమౌనుచీకటి వెలుగుల బ్రతుకు పుటల్లోఅమావాస్యలో వెలుగుల వర్షముపూసే పూవులు దివ్యచమక్కులునక్షత్రాలన్నీ ఇంటి ముందరలోఇల్లాలు వరుసలో అలంకరించినట్లుప్రతిదివ్వె ఉజ్వలంగా ప్రజ్వరిల్లుఇంట్లోంచి పరుగులుతీస్తూ దరిద్రదేవతలక్షీ సరస్వతులు అరుదెంచెరిదిగోలక్షల అక్షరాలు ఐశ్వర్యాలువేణువులైన గానంలో ఇంటిలో నెలవైపూజింప తరమా ఈ జీవితానికి !!కరిగిపోతున్న ఎదమాటున కన్నీళ్ళువేలవత్సరాల చీకట్లు మటుమాయంనీవు వెలిగించిన దీపంజ్యోతులువసంత సౌరభాలు ఇంట్లో గుభాళింపులుఅనంత విశ్వంలో నేనున్నానుఅంటూ అరుదెంచె నిజస్వరూపంలోదివ్యత్వం దివి నుండి భువికికళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతులలోఅదిగదిగో ఊరు ఊరంతావెలుగుల తోరణాల జ్యోతులురంగరించి నింపుకో హృదయంలోఆత్మానందం బ్రహ్మానందం,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More