Blog

Your blog category

మనస్సులో తీయని బాధ

మనస్సులో తీయని బాధ

మనస్సులో తీయని బాధ....!! గడుసు కోయిల పాట లయలాఈ వన్నెల చిన్నదాని హొయలొలుకు నడకపూవుల్లో పసుపు వన్నె పూవైన కోమలివిరబోసుకున్న నాజూకు కురుల లాలసిఅత్యుత్సాహంతో సూర్యకాంత పుష్పాలలో గంతులేసే మృదుల.......ఈ సుందర జగత్తులో మరుల మల్లియలా తెల్లని సూర్యకాంతిలో తెల్లదొరసాని ఆనందాల మనోహరి.......పైరగాలిలో ఉల్లాసంగా తనను తాను మరచిన తన్మయత్వంలో సేదదీరును పూవుల మనస్సు...........సౌందర్య మృదుల సన్నాయి నడుముపై సొగసు వన్నె పసుపు రంగు జాకెట్టులో అలవిగాని ఆనందం దేనికో..........వహ్వా...! తేనెలూరు నీ నునులేత తనువు తెల్లవారు వెలుగులా సొగసరి..........నీలి నీలి ఆకాశం నీ మిడ్డీయై నయనానందకరంగా ఉవ్విళ్లూరు అందం చిత్రకారుని పెయింటింగును తలపిస్తోంది.............చిన్నికొండ పక్క పచ్చికలో పువ్వులలో మేలిమి రసగుల్లవు...........ఇంకా చిన్నతనం చిలిపితనం మరువని మరుమల్లియవు,జాబిలి కూనవు..............హృదయం నిండా తొణికిసలాడే ప్రకృతి సౌందర్య పిపాసలో నీ నర్తనం అపురూపం.............పువ్వుల్లో పూవువై లేలేత నాజూకు నగుమోము తెల్లవారు సుందర శ్యాముని బ్రోలు అందం ఒళ్ళంతా వెల్లవేసినట్లు అద్భుత రసశ్విని..........అలవిగాని ఆనందంలో అందాలను…
Read More
అమ్మ

అమ్మ

కొడుకు: అమ్మా..నా మీద నీకు ప్రేమ తగ్గదు ఎందుకు? అమ్మ: ఎందుకు అలా అడుగుతున్నావ్ రా..? కొడుకు: ఏమో అమ్మా..నా దగ్గర ఏదైనా ఉంటేనేచుట్టూ మనుషులు ఉంటున్నారు..అది లేకపోతే కొంతమంది వెళ్లిపోతున్నారు..నేను బాగున్నప్పుడు ఉన్నవాళ్లు..నేను కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించడం లేదు.. కొడుకు: కానీ నువ్వు మాత్రం అలా కాదు..నేను ఎలా ఉన్నా.. ఏమీ లేకపోయినా..నేను తప్పు చేసినా.. నువ్వు మాత్రంనన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. అమ్మ: నువ్వు చేసే పనుల్ని బట్టినా మీద నీకున్న ప్రేమ మారితే.. అది ప్రేమ కాదు రా..ఇష్టం మాత్రమే. కొడుకు: మరి..ప్రేమంటే ఏంటి అమ్మ? అమ్మ: నిన్ను అర్థం చేసుకోలేని సమయంలో కూడా.. నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం.. నువ్వు ఓడిపోయినప్పుడు“ఎందుకు ఓడిపోయావ్?” అని అడగడం కాదు..నీ పక్కన కూర్చోవడం. కొడుకు: అంటే..మనల్ని ఎప్పుడూ వదలకుండా మన తప్పుల్ని సరిచేసే వాళ్లే మనల్ని నిజంగా ప్రేమించినట్టా అమ్మ? అమ్మ: అందరూ ఇక్కడే ఓడిపోతారు రా..మన పక్కన ఎవరో…
Read More
బంధాల సంకెళ్లు

బంధాల సంకెళ్లు

అక్షర కొరకుఅంశం :⁠- బంధ విముక్తి(చిత్ర కవిత)తేది:⁠- 24/09/2026కవితసంఖ్య:⁠- 37శీర్షిక:⁠- బంధాల సంకెళ్లు@@@@@@@@@@@@@@@@@ బంధాల సంకెళ్లను తెంచుకున్న వేళమనసు పొందే అనుభూతి వర్ణనాతీతంనిన్నటి మోయలేని జ్ఞాపకాల బరువును దించినేడు స్వేచ్ఛగా రెక్కలు విప్పిన పక్షిలా ఎగరడంఎవరి కోసమో బ్రతికిన క్షణాలను వీడి నీ కోసం నువ్వు శ్వాసించే క్షణమే బంధ విముక్తిఆశల తీరాలను దాటి ఆరాటాలను వెనక్కి నెట్టిప్రశాంతత వైపు సాగే పయనమై నిజమైన ముక్తిమమకారాల మాయాజాలంలో చిక్కుకునినన్ను నేను కోల్పోయాను నిన్నటి వరకు అంచనాల భారంతో అలసిపోయిన హృదయాన్నిఈరోజే తెలిసింది బంధం అంటే ఒక బందీఖానానిరాశాలను వీడడమే నిందలను మరవడమేఎవరి పై ఆధారపడకుండా జీవించడమేఈ లోకాన కర్మల బంధాల నుండి విముక్తి ఆత్మ రాముడికి దొరికిన పరమ శాంతి ముక్తినడి సముద్రాన మునిగిన వ్యక్తిని కాపాడేసుడిగుండం నుండి బయటకు రావడానికి తపన పడేఈ క్షణంలో బ్రతకడమే అసలైన జీవన ముక్తిఒడ్డు పై నుండి ప్రయత్నించే చెయ్యి అందుకోవడానికి ప్రయత్నించే... డా.…
Read More
గోడ చాటున పసి హృదయం

గోడ చాటున పసి హృదయం

అక్షర రచయితల సంఘం అంశం: పసి మనసు శీర్షిక: గోడ చాటున పసి హృదయం బొమ్మను గుండెకు హత్తుకుని గోడ చాటున ఒదిగెను...పసివాడు భయముతో కుంచించుక పోయెను... అమ్మ కన్నీటి చుక్కలలో బాలుని నవ్వు కరిగెను....నాన్న కోపపు మాటలలో బాల్యము వణికెను... పగిలినది సీసా మాత్రమే కాదు...పసి కలలు పగిలెను...విసిరినది మాట మాత్రమే కాదు....మనసు గాయపడెను.. ఆ చిన్ని కళ్ళలో ఆటలు లేవు...ఆందోళన నిండెను...ఆ చిన్ని చేతులలో బొమ్మ మాత్రమే ఆసరా లేదు... తల్లిదండ్రుల గొడవ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది....పసి మనసు సున్నితం... ప్రేమతో పెరగాలి భయంతో కాదు...ఇంట్లో ప్రశాంతతే పిల్లలకు అసలైన ఆస్తి... మీ కోపాన్ని పిల్లల ముందు చూపకండి....వారి బాల్యాన్ని కాపాడండి... పిల్లల ముందు మాట్లాడే ప్రతి మాట వారి మనసులో ముద్ర వేస్తుంది.... పిల్లలకు కావలసింది ఖరీదైన బొమ్మలు కాదు భయం లేని ఇల్లు.... ఈ రచన నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.…
Read More
కళ జనజీవనం చైతన్య హృదయ కుహరం

కళ జనజీవనం చైతన్య హృదయ కుహరం

కళ జనజీవనం చైతన్య హృదయ కుహరం,,,,,,,,,,!! ఏదైనా ఒక రంగంలో మేటి అనిపించుకోవాలంటేచుట్టూ వెకిలి మూకల వేళాకోలం ఆతోపుకు తాడోపేడో తేల్చుకుందాం అంటూ ముందుకు మున్ముందుకు వెళతాం,,,,,,,,,,,,ఆ రంగంలో జయాపజయాలను చవిచూస్తూ ఎన్నెన్నో మైలురాళ్ళు దాటుతూ ఆకలి దప్పికలు మరచి నిరంతరం సాధన చేస్తూ సాగే శ్రమల జీవితం,,,,,,,,,,,ఒకదశలో ఏమి ఆదాయం లేని ఈ రంగం వదిలేసుకొని పోదునా అన్న సంశయం,,,,,,,,,,,,,,నాతోపాటు కొందరు ఇదే రంగం నమ్ముకుని జీవితాన్నే అంకితం చేసుకున్నారు కదా నేనెందుకు వెనకంజ వేయాలి అన్న సాలోచన ముందుకెళ్ళు ఏదీ ఏమైనా,,,,,,,,,ప్రస్తుత రంగంలో రచనలో వైవిధ్యం కొరకు ఎందరెందరో మహానుభావుల విలువైన కళాఖండాల అధ్యయనం జీవితంలో అప్స్ ఎండ్ డవున్స్ అందరికీ సహజమని తెలుస్తుంది,,,,,,,,,,,,,మేటి కళాకారుడని పొగుడుతూనే వెనుక గోతులు తీసేవారు కోకొల్లలు,,,,,,,,,,,,ఒక స్థితికి వచ్చాక దానిని నిలుపుకోవడానికి పడరాని పాట్లుపడాలి,,,,,,,,,,,,,,సమకాలీన కళాకారుల అద్భుత కళాఖండాలు అధ్యయనం చేయాలి నేను వారిలో కొంతైనా వైవిధ్యం కనబరచాలి అని సృజియించే…
Read More
నిజమైన పండుగ

నిజమైన పండుగ

అక్షర కొరకు చిత్ర కవితఅంశం:రంగు వెలిసిన జీవితాలు శీర్షిక : నిజమైన పండుగ లోపల దేవికి రంగులు అద్దుతున్నారు...కళ్ళకు కాటుక దిద్ది కళ తెస్తున్నారు.... పది చేతులకు ఆయుధాలు ఇచ్చి శక్తి రూపాన్ని మలుస్తున్నారు... బయట మాత్రం భుజాన సంచితో చిరిగిన చొక్కాతో ఒక బాలుడు....రంగు వెలిసిన జీవితాన్ని మోస్తూ గోడ మీద దేవి కన్నులు గీస్తున్నాడు.... లోపలి దేవి కళ్ళు తెరిస్తే పండగ...బయటి బాలుడి కడుపు నిండితేనే పండగ... రాయికి రంగు వేసే చేతులున్నాయి...మనిషి ఆకలి తీర్చే మనసు కరువైంది... రాళ్లలో దేవుణ్ణి వెతికే మనం మనిషిలో దేవుణ్ణి మరిచాం.గుడిలో దీపం వెలిగించే ముందు వీధి బాలల కడుపులో దీపం వెలిగిద్దాం... అదే నిజమైన పూజఅదే నిజమైన దసరా... నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. గరిగిపాటి శ్రీ లక్ష్మీ నారాయణమ్మ.ఏలూరు
Read More
సీసము

సీసము

సీసము!!🚩💐🪷 పాఠక దేవుళ్ళు పద్యాన్ని బ్రతికించవర్ధిల్లుచుండును వసుధలోన!!రాబోవు తరములు రాజిల్లవలెనన్నకావ్యాలు రచియించ కవికులమ్ము!!నీతిని బోధించి జాతిని బ్రతికించవిశ్వ గురువుగాను వెలుగు చుండు!!సమ భావనమ్మును విమల మనస్సుతోచూపించి నడిపించ చొరవ చూపు!! తేటగీతి!! గడప దాటిన వేళను కలము బట్టిధర్మ రక్షణ చేయుచు దండుగట్టికుల మతాలకు తలవంచి కూర్మి విడువనిప్పు రవ్వలెగిసిపడు నిజము కృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!
Read More
అవిసిపోయిన హృదయాలు

అవిసిపోయిన హృదయాలు

అక్షర కొరకుఅంశం : పసిమనసుశీర్షిక :అవిసిపోయిన హృదయాలు! విషం నింపుకున్న కళ్ళుమనసు పాశానభూయిష్టమైఅడుగు అడుగుకు విష సర్పం చూపులైకడలి తరంగాల సునామీ రక్తాక్షరియైవిలువలు కొరవడి మలిన మస్తిశ్కమైఅంగడిబొమ్మ సినీ సితారయైమండే గుండెలవిసి పోయిన గద్గద కంఠమైపూరిగుడిసెలా అడ్రస్ లేని నివాసమైవిరిసిన గులాబీ యవ్వనం అందం పగిలిన చందం!నా పగిలిన హృదయం అద్దం నిండా నీ ప్రతిబింబాలైవిరిగి నలిగిన హృదయం నిండా రక్తధారలైపేలిపోయిన ముహం పడిగాపుల సంవేదనయిబొట్లుబొట్లుగా కారే రక్తం చిరునామా నేనై!పెద్దబండరాయి పగిలిముక్కలై కరిగి తరిగి ఇసుక రేణువులైపొంగివస్తున్న లావాచింతనిప్పుల అగ్నియైవేపుడు కాయల్లా కళ్ళు వేగి వేగి మంటలసూరీడైనిద్రరాని రేయి గది నిండా పరుచుకున్న రక్తవర్ణ నక్షత్రాలైజాలిలేని లోకం వేసే బానాలు గుండెలయలు అక్షరఘంటికలైచీల్చి చెండాడే విశ్వకుబేరుల రక్తదాహానికి పావునై!రక్తం పాలుగా మారి పసివాడి దాహం తీరిస్తేఅమ్మ అన్న పదం ఒకటి కళ్ళకు నివాళి వెలుగులవుతాయి! అపరాజిత్సూర్యాపేటహామీపత్రం : ఈ రచన నా కలం సేత యని నా హామీ
Read More
కామిని రాయ్

కామిని రాయ్

కామిని రాయ్(బెంగాలీ కవియత్రి, సామాజిక కార్యకర్త ఇంకా బ్రిటిష్ భారతదేశపు స్త్రీవాది) కామిని రాయ్ (12 అక్టోబర్ 1864 – 27 సెప్టెంబర్ 1933) బ్రిటిష్ ఇండియాలో ఒక బెంగాలీ కవయిత్రి, సంఘ సేవకురాలు మరియు స్త్రీవాది . ఆమె బ్రిటిష్ ఇండియాలో ఆనర్స్ పట్టా పొందిన మొదటి మహిళ.1864 అక్టోబర్ 12న, అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని బేకర్గంజ్ జిల్లాలో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ఝలోకటి జిల్లా) ఉన్న బసుంద గ్రామంలో జన్మించిన రాయ్, 1883లో బెథూన్ పాఠశాలలో చేరారు. బ్రిటిష్ ఇండియాలో పాఠశాలకు వెళ్లిన మొదటి బాలికలలో ఒకరైన ఆమె, 1886లో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క బెథూన్ కళాశాల నుండి సంస్కృత ఆనర్స్‌తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సంపాదించి , అదే సంవత్సరంలో అక్కడ బోధించడం ప్రారంభించారు. దేశం యొక్క రెండవ మహిళా ఆనర్స్ గ్రాడ్యుయేట్ అయిన కదంబిని గంగూలీ , రాయ్ కంటే మూడు సంవత్సరాలు సీనియర్ తరగతిలో…
Read More
కుమార్తెల దినోత్సవం

కుమార్తెల దినోత్సవం

ప్రతి తల్లి ఒకరికి ముద్దుల కూతురే ఇప్పుడు మనం ఇలా కూతుర్ల దినోత్సవం అంటూ జరుపుకుంటున్నాం కానీ ఆడపిల్లని గౌరవించడం అనేది అనాది గా వస్తున్న సంప్రదాయం ఆడపడుచు ను మహాలక్ష్మి గా భావిస్తూ ఒడి నింపడానికి గానూ, బతుకమ్మలో అమ్మగానూ, ప్రతి పండగలో కూతుర్ని ఇంటికి పిలిచి బట్టలు పెట్టడం, ఆమె తో కొత్త ఇంటికి గృహప్రవేశం చేయడం, ఆమెని సంతోషం గా ఉంచడం ఆమె తనవారు అనుకున్న అందరికీ మంచి జరగాలని కోరుకోవడం చాలా సహజంగా మన ఇళ్లలో జరిగిపోతున్న ప్రక్రియ... ఇప్పుడంటే వీరికొక దినోత్సవం అని ఆధునికంగా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు. కానీ మన ఆడపిల్లను మనం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. అలాగే అనాదిగా కూడా ఆడపిల్ల ఆనాటి అమ్మమ్మల నుండి ఈనాటి మానవరాళ్ల వరకు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ సహజం అని అన్నీ భరిస్తూ, కుటుంబ రక్షణ కోసం మౌనంగా ఉంటున్న నాతో పాటు…
Read More