Book and Movie Reviews

ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్పే, మనసును తడిపే మల్లాది గారి “అందమైన జీవితం”

ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్పే, మనసును తడిపే మల్లాది గారి “అందమైన జీవితం”

ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్పే, మనసును తడిపే మల్లాది గారి "అందమైన జీవితం" "అందమైన జీవితం" అనే నవల నాకు చాలా అనుకోకుండా పరిచయమైంది. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎక్కడో ఒక పజిల్ పోటీలో పాల్గొని సమాధానం పంపాను. దానికి బహుమతిగా ఈ నవల వచ్చింది. అది వస్తుందని కూడా నాకు తెలియదు. కానీ యాదృచ్ఛికంగా నా చేతికి వచ్చిన ఆ పుస్తకం, తర్వాత నా జీవితంలో అత్యంత ఇష్టమైన నవలలలో ఒకటిగా మారిపోయింది. ఎన్నోసార్లు చదివినా మళ్లీ చదవాలనిపించే అరుదైన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ నవలను రాసింది ఆహ్లాద రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాది వెంకట కృష్ణమూర్తి. ఆయన ఎలా ఉంటారో, ఆయన రూపం ఏమిటో తెలుగు పాఠకుల్లో చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఫోటోలు దాదాపుగా ఎక్కడా ప్రచురితం కాలేదు. కానీ ఆయన రచనలు మాత్రం లక్షలాది మంది పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా…
Read More
మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి

మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి

మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి నా బి.టెక్ క్లాస్‌మేట్, నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు, హైదరాబాద్‌కు వచ్చిన మొదట్లో మాతోనే ఉండేవాడు. తర్వాత స్వంత ఊరు గన్నవరం వెళ్ళిన తర్వాత కొంత కాలం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. తరువాత ఒక రోజు అతను స్వంత ఊరిలో చెడు స్నేహాలతో అయిన మద్యపాన వ్యసనంతో ఆరోగ్యం దెబ్బతిని మరణదశలో ఉన్నాడని తెలిసింది. నేను, మా మరో స్నేహితుడు వెంటనే విజయవాడ వెళ్లి అతన్ని చూశాం. చిన్న వయసులోనే జీవితం చేతులారా జారిపోతున్న అతని పరిస్థితి చూసి కన్నీళ్లు ఆగలేదు. అతను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఇద్దరు పెళ్లైన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ముందే చనిపోయారు, తల్లి అతన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నిస్తుంది. అతన్ని ఎలా అయినా కాపాడాలని మేము కూడా ప్రయత్నించాం. వైద్యులు చెప్పింది ఒక్కటే, కాలేయ మార్పిడి జరిగితే బ్రతికే అవకాశం ఉందని.…
Read More
✨మరీచిక✨ (Mareechika) – మూవీ రివ్యూ

✨మరీచిక✨ (Mareechika) – మూవీ రివ్యూ

✨మరీచిక✨ (Mareechika) - మూవీ రివ్యూ నటీనటులు: రెజీనా కసాండ్ర, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్దర్శకత్వం: సతీష్ కాశెట్టిజానర్: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ✨కథాంశం:ఇది ఇద్దరు మహిళల చుట్టూ తిరిగే ఒక పగ, మైండ్ గేమ్స్ నేపథ్యంలో సాగే క్రైమ్ స్టోరీ. అనుకోని పరిస్థితుల్లో ఒకరి జీవితంలోకి మరొకరు రావడం, వారి మధ్య జరిగే సైకలాజికల్ వార్, చివరకు ఆ సస్పెన్స్ ఎలా వీడింది అనేదే 'మరీచిక'. ✨ ప్లస్ పాయింట్స్ (నచ్చినవి)నటన: రెజీనా కసాండ్ర ఇంటెన్స్ లుక్స్, అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఇద్దరూ తమ పాత్రల్లోని డార్క్ షేడ్స్‌ని బాగా పండించారు.మూడ్ & అట్మాస్ఫియర్: సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక రకమైన హాంటింగ్ (haunting), సీరియస్ మూడ్‌ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.ట్విస్ట్‌లు: సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్ కలిగిస్తాయి. 👎 మైనస్: పాయింట్స్ (తగ్గినవి)కథనంలో నెమ్మది: కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే…
Read More
గోదావరి

గోదావరి

గోదావరి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో జరుగుతుంది.. భద్రాచలం వెళ్ళడానికి పడవలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్ళడం నాకు చాలా నచ్చింది. నాకు కూడా అలా పడవలో వెళ్ళడం చాలా ఇష్టం.. సందర్భం బట్టి పాటలు ఉండడం చాలా చాలా బాగుంటాయి.. ఈ సినిమాలో హీరో మరదలు కి కొంచెం అహంకారంగా ఉంటుంది. బావ తనని ప్రేమిస్తున్నాడు అని తెలిసిన వేరే అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. తన ఇష్టాలు కాదన్నాడని తన బావని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోమని చెప్పింది అది చూసి హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకుంటుంది హీరోని. తర్వాత హీరోయిన్ డైరీ దొరకడం హీరో చదివి వాళ్ళ ఇంటికి వెళ్లడం అదే లాస్ట్ ఎండింగ్. ఈ సినిమా నాపై ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికీ అయితే ఎన్నో సార్లు చూసాను. అంత ఇష్టం. అసలు మాటలు రావడం…
Read More
రంగస్థలం

రంగస్థలం

రంగస్థలం నాకు నచ్చిన సినిమా రంగస్థలం ఆ సినిమాలో పల్లెటూరు వాతావరణం చుట్టూ సాగే కథ 1980వ నాటి సాంప్రదాయాలు కట్టుబాట్లు మధ్య జరిగే భావోద్వేగాలు పల్లెటూరి జానాల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఇందులో రాంచరణ్ నటన ఒక చెవిటి వాడిగా నటించడం అనేది చాలా గొప్ప విషయం మన నిజ జీవితాలకి దగ్గరగా ఉండే సినిమా రంగస్థలం. - భరద్వాజ్
Read More
నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమా, అధ్భుతమైన సినిమా అంటే ఓకే ఒక్కటి అలాంటి సినిమాలు మళ్లీ రావంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచి సినిమా , సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అధ్భుతంగా ఆవిష్కరించిన సినిమా "స్వర్ణ కమలం". నాట్యం అంటే నాకు చాలా ఇష్టం. నాట్యం నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉండేది. అందువల్లే ఆ చిత్రాన్ని ఇష్టపడను ఏమో కానీ కే. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా నాట్యం లోని మెళకువలు, నాట్యం లోని అనుసరణలు అన్ని తెలిపారు. నాట్యం అంటే ఆసక్తి లేని హీరోయిన్ తండ్రి గుడ్డి తనన్ని ఆసరాగా చేసుకొని అతన్ని మోసం చేస్తూ ఉంటుంది. అక్క ఇంటి బాధ్యతలు చేపట్టి తనూ సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. అదే పోర్షన్ లో సంగీతం నేర్చుకునే అబ్బాయి ఆమెను ప్రేమిస్తూ తన ప్రేమను వెళ్ళడిస్తూ ఆమె అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.…
Read More
అహ నా పెళ్లంట

అహ నా పెళ్లంట

అహ నా పెళ్లంట నాకు నచ్చిన సినిమాలంటె చాలానె ఉన్నాయి కానీ దాంట్లో మరీ మరీ ఇష్టమైన సినిమా అంటే "అహ నా పెళ్లంట" ఈ సినిమాలోకామెడీ చాలా ఇష్టం.. జీవితంలో అన్నీ కష్టాలే కదా! ఏడుపులు లేని జీవితాలు ఉండవేమో! ఆ అనుభవాల నుండి కాస్త రిలీఫ్ అవడానికి ఇలా నవ్వుకునే సినిమాలంటె చాలా ఇష్టం నాకు.. ఈ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు హీరోయిన్ రజనీ గారు ఇక కోట శ్రీనివాస రావు గారు బ్రహ్మానందం గారైతే ఆ సినిమాకె హై లెట్.. దర్శకుడు జంధ్యాల గారు సంగీత దర్శకుడు పసుపులేటి రమేశ్ నాయుడు గారు.. నిజంగా సినిమా అంతా కూడా నవ్వించడం అంటే మామూలు మాట కాదు.. ఆ నవ్వులు ఎప్పటికీ మరిచి పోలేం! నాకైతే బాగా నచ్చిన సినిమా అది.. - ఉమాదేవి ఎర్రం
Read More
నిరీక్షణ

నిరీక్షణ

నిరీక్షణ బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో 1982లో విడుదలైన ఆల్ టైం క్లాసిక్ మూవీ "నిరీక్షణ" అంటే నాకు చాలా ఇష్టం. భానుచందర్ అర్చన గారు మెయిన్ రూల్స్ లో నటించారు. నటించారు అనడం కంటే జీవించారు అనడం సమంజసమేమో అంత బాగా సహజంగా ఉంది వారి నటన. నిరీక్షణ కథ విభిన్నమైనది. ఫారెస్ట్ ఆఫీసర్ అయినా గిరిజన అమ్మాయి అయినా తులసి అంటే అర్చన ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో పోలీసులు భానుచందర్నీ నక్సలైట్ గా పొరపాటు పడి అరెస్టు చేస్తారు. తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా అతిహేయంగా అవమానిస్తారు భానుచందర్ని. సహనం కోల్పోయిన భానుచందర్ కోపోద్రిక్తుడై తిరగబడడంతో ఆ పెనుగులాటలో అనుకోకుండా ఒక పోలీసు మరణానికి కారణం అవుతాడు. దీంతో పోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తుంది. శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలైన భానుచందర్ బస్సులో ప్రయాణిస్తూ ఆ ప్రయాణికులు అడిగిన…
Read More
సాగర సంగమం

సాగర సంగమం

సాగర సంగమం కళాతపస్వి విశ్వనాథ్ గారు దర్శకత్వం లో, కమల్ హాసన్ గారు, జయప్రద గారు నటించిన ఈ చిత్రం ఓ అధ్బుతం.. తనలో దాగిన నృత్య కళ, అందులో ఎంతో ప్రావీణ్యం కల్గి వుండటం, మరో వైపు ఒక అమ్మాయి మీద వున్న ప్రేమ రెండింటికి న్యాయం చేస్తూ, ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయి మన జీవితంలో వున్న లేదా వేరొకరికి జీవిత భాగస్వామి అయిన తను ఎప్పుడూ బాగుండాలని అహర్నిశలు తనలో దాగి ఉన్న కళ కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం పాటుపడిన ఒక కళాకారుడి ప్రేమ కథ ఈ సాగర సంగమం - అశోక్
Read More
నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమా దసరా బుల్లోడు. ఈ సినిమా మా ఊరు భట్లపెనుమర్రు లో తీసారు. దసరా బుల్లోడు సినిమా  1971,జనవరి 13వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాకు దర్శకుడు శ్రీ వి.బి. రాజేంద్రప్రసాద్. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు,వాణిశ్రీ, చంద్రకళ,ఎస్. వి. రంగారావు, సూర్యకాంతం, రావి కొండలరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు మొదలైన గొప్ప నటీనటులు నటించారు. ఈ సినిమాను ప్రముఖ సినిమా సంస్ధ అయిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించారు. కె. వి. మహదేవన్ గారు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుసీల గారు పాడిన ఆ పాటలు ఇప్పటికీ ప్రజల మనసును దోచుకుంటున్నాయి. చేతిలో చెయ్యేసి చెప్పు బావా అనే గీతం ఇప్పటికీ మనసును కదిలించి వేస్తుంది. చక్కటి గ్రామీణ నేపధ్యంలో తీసిన సినిమా ఇది.…
Read More