బాపూజీ కళ్లజోడు
బాపూజీ కళ్లజోడు సబర్మతి ఆశ్రమంలో ఒకరోజు ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. గాంధీగారు మాత్రం చిరునవ్వుతో... కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు? అంతలో ఆశ్రమవాసి రాములు పరుగెత్తుకుంటూ వచ్చాడు."బాపూజీ! పెద్ద సమస్య వచ్చేసింది!" అన్నాడు గాబరాగా."ఏమైంది రాములు…? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా? లేక మేకలు సమ్మె చేశాయా?" అని గాంధీగారు నవ్వుతూ అడిగారు."అది కాదు బాపూజీ..! మీ కళ్లజోడు కనిపించడం లేదు!" అన్నాడు."అయ్యో! మరి నేను ఉదయం నుంచి ఏం పెట్టుకుని పత్రిక చదివాను?" అని గాంధీగారు ఆశ్చర్యపోయారు.అందరూ ఆశ్రమం అంతా వెతకడం మొదలుపెట్టారు. వంటగది, ప్రార్థనా మందిరం, తోట. ఎక్కడ చూసినా కళ్లజోడు కనిపించలేదు?ఇంతలో పక్కనే ఉన్న చిన్నబ్బాయి మోహన్ ,"బాపూజీ! మీరు కళ్లజోడు లేకుండా ఎలా పత్రిక చదివారు?" అడిగాడు.గాంధీగారు కాసేపు ఆలోచించి,"అది నిజమే కదా…!" అన్నారు.అంతలో మోహన్ ,"బాపూజీ! మీ కళ్లజోడు మీ తలపైనే ఉంది!" మెల్లిగా చెప్పాడు.అందరూ ఒక్కసారిగా గాంధీగారి తలవైపు చూశారు.…