సంతోషానికి అయిదు మెట్లు
సంతోషానికి అయిదు మెట్లు *అపరిమిత సంతోషంగా ఉండాలంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలతో గడిపే సమయం మనసుకు ఆనందం కలిగిస్తుంది. *ప్రకృతి దృశ్యాలు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. అందుకే ప్రకృతిలో విహరించాలి. గార్డెనింగ్ చేసినా ఎంతో ఆనందం కలుగుతుంది. * చేసే పని పట్ల ఇష్టం పెంచుకోవాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. ఇష్టంతో పనిచేస్తే పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. పనులు సక్రమంగా పూర్తి అయితే మనసుకు సంతోషం కలుగుతుంది. * ఇష్టం అయిన రచనలు చదువుతూ ఉండాలి. అలాగే ఇష్టం అయిన సంగీతం వింటూ ఉండాలి. అప్పుడే మనిషికి సంతోషం కలుగుతుంది. * ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే సంతోషం కలుగుతుంది. ఆనారోగ్యం మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ సూత్రాలు పాటిస్తే మనిషి అపరిమిత ఆనందంగా ఉంటాడు. - వెంకట భానుప్రసాద్ చలసాని