పుత్రోత్సాహం – కథానిక
పుత్రోత్సాహం - కథానిక వెంకట్రావుకిప్పుడు అరవై ఏళ్ళు దాటాయి.ఆర్నెల్ల కితం రిటైర్మెంట్ తీసుకున్నాడు.రేపు ఫాదర్స్ డే అని వాకింగ్ లో తన మిత్రులు అనుకోవటం విన్నాడు..వెంకట్రావు గతం తాలూకు జ్ఞాపకాలన్నీ తల్లి గాజుల చప్పుడులా గలగలమంటూ విన్పించసాగాయి..కాసేపు వాలుకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు తన చిన్నప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే, బ్రదర్స్ డే ఉన్నాయేమో కానీ తనవయసు వారికి తెలీదు..నాన్నంటే భయముండేది..అమ్మంటే ధైర్యముండేది..వీలయినంతవరకు తండ్రిని తప్పించుకు తిరిగేవాడు..ఆయన తను పనిచేసే కంపెనీలో యూనియన్ లీడర్ అని టెన్త్ క్లాసులో తెలిసింది.బయటెలాఉన్నా ఇంట్లో మాత్రం స్ట్రిక్ట్ గా ఉండేవాడు..చిన్నతనంలో తన చదువంతా అమ్మ చూసుకుంటే ఇంటర్మీడియెట్ వచ్చాక ఫ్రెండ్స్ అలవాటయ్యారు.. ఆరోజు గుర్తుంది..ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకున్నాడు తను..తండ్రికి ఈ విషయం చెప్పి ఫీజు గురించి కూడా చెబుదామనుకున్నాడు కానీ ధైర్యం రాలేదు..ఆ రోజు తండ్రి ఇంట్లోనే ఎవరితోనో మీటింగ్ లో ఉన్నాడు..లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటుంటేవెళితే కానీ…