మొదటి బాధ్యత
మొదటి బాధ్యత ఆనంద్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నగరంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను, భార్యను, ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవించేవాడు. కుటుంబం సంతోషంగా ఉండేది. పెద్ద ఆశలు లేకపోయినా, ఉన్నదానితో తృప్తిగా బతికేవారు. ఒకరోజు ఆనంద్ పనిచేస్తున్న కార్యాలయంలోకి ఒక వార్త వచ్చింది.“రవి కంపెనీ డబ్బును దుర్వినియోగం చేశాడట!”ఆ మాట విన్న ఆనంద్ ఒక్కసారిగా కంగుతిన్నాడు.“అది నిజం కాదు సార్! నేను అలాంటి పని చేయలేదు” అని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు? ఎవరో ఆనంద్ పేరుతో... నకిలీ పత్రాలు, మార్పులు చేసిన ఫొటోలు, తప్పుడు సందేశాలు తయారుచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు?కొద్దిసేపటికే ఆ వార్త వైరల్ అయింది. ఆనంద్ ఫోన్ ఆగకుండా మోగింది. స్నేహితులు దూరమయ్యారు. బంధువులు అనుమానంగా చూశారు. కార్యాలయం అతన్ని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించింది.ఇంటికి వచ్చిన ఆనంద్ ని చూసి భార్య సుమన కన్నీళ్లు పెట్టుకుంది.“మనల్ని నమ్మిన వాళ్లే…