మనసులో పూస్తూనే ఉంటాయి
మనసులో పూస్తూనే ఉంటాయి ఒక చిన్న ఊరిలో అనన్య అనే అమ్మాయి ఉండేది. ఆమెకు గులాబీలు అంటే ఎంతో ఇష్టం. కానీ , అందరూ ఎరుపు, తెలుపు గులాబీలను ఇష్టపడితే... ఆమెకు మాత్రం నల్ల గులాబీలంటే ప్రాణం. ఒక రోజు ఆమె స్నేహితుడు ఆర్యన్ ,"అందరూ రంగుల పూలను ఇష్టపడుతుంటే… నువ్వెందుకు నల్ల గులాబీలు ఇష్టపడుతున్నావు?" అని అడిగాడు.అనన్య చిరునవ్వుతో…"రంగుల పూలు ఆనందాన్ని చెబుతాయి. కానీ , నల్ల గులాబీలు మనసులో దాచుకున్న కథలను చెబుతాయి" అంది.కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ ఉద్యోగం కోసం దూరంగా వెళ్లిపోయాడు. రోజులు గడిచాయి. నెలలు మారాయి. కానీ , అతను తిరిగి రాలేదు.ఒక రోజు అనన్య ఇంటి ముందు ఒక చిన్న పార్సెల్ వచ్చింది. తెరిచి చూస్తే అందులో ఐదు నల్ల గులాబీలు. వాటితో పాటు ఒక చిన్న చీటీ."కొన్ని బంధాలు మాటల్లో కాదు! మౌనంలో బ్రతుకుతాయి."ఆ చీటీ చదివిన అనన్య కళ్లలో నీళ్లు…