ఇచ్ఛాపురపు రామచంద్రం
ఇచ్ఛాపురపు రామచంద్రం ఇచ్ఛాపురపు రామచంద్రం ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. ఆయన సావిత్రి బాయిపూలే ట్రస్ట్ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్త.ఈయన విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో సత్యవతి, వైద్యనాథం దంపతులకు 1940, జూన్ 16న జన్మించాడు. బి.ఎ. (ఎకనామిక్స్) చదివాడు. వృత్తిరీత్యా 1968 నుండి జీవితభీమా సంస్థలో పనిచేసి 2000 సంవత్సరంలో అనకాపల్లి బ్రాంచి ఆఫీసులో పదవీవిరమణ చేశాడు. తరువాత విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందాడు. కాశీమజిలీ కథలను అనువాదం చేశాడు. బాలసాహిత్యంలో 40నుంచి 50 వరకూ పుస్తకాలు రాసిన ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ఆయన కథలు వందకుపైగా ప్రచురితమయ్యాయి.దారి పక్క దీపాలు (కథా సంపుటం)సిద్ధార్థ (కథా సంపుటం)సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి : సరళ సుందర పౌరాణిక ఉత్కంఠ కథా సంగ్రహముభట్టి…