Music

సంగీత దినోత్సవం

సంగీత దినోత్సవం

సంగీత దినోత్సవం సంగీతం అనేది జగమంతటాపలికే ఒక మూగ భాషఅది అలసిన గుండెలకుఅమృతాన్ని పంచే దివ్య లాలసభాషల సరిహద్దులు లేని విశ్వజనీన రాగమదిమనుషుల మనసులనుఏకం చేసే అమర నాదమదిఏడు స్వరాల సరిగమలేసృష్టికి అందమైన మూలాలు ఆ స్వరాల కలయికలే గుండెల్లో పలికే భావనలుసంతోషంలో తోడుంటూ పరవశింపజేస్తుంది సంగీతందుఃఖంలో ఓదార్పునై కన్నీరు తుడుస్తుంది ఈ గానంపక్షుల కిలకిలరావాలలో ప్రకృతి పాడే పాట ఉందిపారే సెలయేటి సవ్వడిలో ఒక మధురమైన శృతి ఉంది పిల్లనగ్రోవి ఊదే వేళ మురళీకృష్ణుడే గుర్తుకువచ్చునువీణా నాదం వినే వేళ శారదా దేవియే సాక్షాత్కరించునుసంగీత దినోత్సవ వేళ స్వరార్చన చేద్దాం రండిమనసులోని ఒత్తిడిని రాగాలతో తరిమికొట్టండిపాటల పల్లవిలో జీవిత సత్యాలను వెతుక్కుందాం చరణాల లయలో సాగుతూఆనందంగా జీవిద్దాంవిశ్వమంతటా నిండిననాదబ్రహ్మానికి వందనంసంగీతమే ప్రాణంగా బ్రతికే కళాకారులకు అభినందనంఅనునిత్యం మనల్నిఓదార్చే స్వరలయలకు జేజేలుఈ సంగీత జగతిలోవికసించనీ సరికొత్త రాగాలు… మాధవి కాళ్ల
Read More