ఆ!!వె!!
కోరినంత కూడు కుమ్మరించగ వచ్చుపంచవచ్చు తిరిగి పైకమున్ను!!జ్ఞానమొసగలేరు జననీ జనకులిలతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! భుజము భుజము గలిపి భూమినెత్తగ వచ్చుకడలినైన పట్టి కడవవచ్చు!చీలిపోయిన యెడ చిక్కులో పడుననితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! చేతిలోని బిడ్డ చెడిపోవుచుండంగతల్లడిల్లు చుండ్రి తల్లిదండ్రి!పట్టికొట్టబోవ పరువంత బోవనితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! చేతికందినంత సింధూరమును బూసిగండపెండెరములు కట్టిన యెడగాడిదలిలలోన గాండ్రించలేవనితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! దుష్ట శక్తులెల్ల దూరిన నీలోనరొంపిపనులనవియు ప్రోత్సహించు?నమ్మి చేరగాను నరకమ్ము జేర్చునుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! మంచినెవరుజెప్ప మౌనముగా వినబ్రతుకు చుంద్రు జనులు భవ్యముగను!చెడును జెప్పువాని చెంప పగులగొట్టతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! పరుగుబెట్టిబోవ పండితుల వెనుకజ్ఞాన సుధలుబంచి జయము గూర్చు!తెరువరికిలలోన తేనె నొసగినట్లుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! మూఢమతుల చెలిమి మొండి వాదన బెంచభ్రాంతి లోన బ్రతుకు క్రాంతి లేక!సంస్కరించవచ్చు శాస్త్రమున్ నమ్మినతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! భుజము భుజము గలిపి భూమినెత్తగ వచ్చుకడలినైన పట్టి కడగవచ్చు!చీలిపోయిన యెడ చిక్కులో పడుననితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి