social stores

అంధకారం చేస్తుంది

అంధకారం చేస్తుంది

అంధకారం చేస్తుంది యవ్వనం అనేది జీవితంలో అత్యంత విలువైన దశ. ఈ వయస్సులో కలలు, ఆశలు, లక్ష్యాలు, సాధించాలనే తపన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు యవతే బలమైన పునాది. అయితే నేటి సమాజంలో అనేక కారణాల వల్ల ఈ అమూల్యమైన యవ్వనం కాలిపోతూ, దారి తప్పుతోంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్యగా కూడా మారింది. సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేసినా, దాని దుర్వినియోగం యువతను ఒంటరితనంలోకి నెడుతోంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ఆటలకు బానిసలై విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. నిజ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గి, మానసిక ఒత్తిడి పెరుగుతోంది. మాదకద్రవ్యాలు, మద్యం, చెడు స్నేహాలు కూడా యువతను పతనానికి గురిచేస్తున్నాయి. క్షణిక ఆనందం కోసం వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి…
Read More
మగాళ్లు… జాగ్రత్త!!!

మగాళ్లు… జాగ్రత్త!!!

మగాళ్లు… జాగ్రత్త!!! నేటి సమాజంలో మహిళల భద్రత గురించి ఎంతగా మాట్లాడుతున్నామో, అదే స్థాయిలో పురుషులు ఎదుర్కొనే సమస్యల గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. "మగాడివి కదా… భరించు" అనే భావన చాలా మందిని మౌనంగా బాధపడేలా చేస్తోంది. ప్రతి పురుషుడు తప్పు చేయడు. అలాగే ప్రతి మహిళ కూడా బాధితురాలే అని ముందే నిర్ణయించలేం. నిజం ఏదైనా, అది సాక్ష్యాలతోనే నిరూపించాలి. కానీ కొన్నిసార్లు తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత కక్షలు, సోషల్ మీడియా ట్రోలింగ్, ఆర్థిక దోపిడీ, భావోద్వేగ బ్లాక్‌మెయిల్ వంటి ఘటనల్లో కొంతమంది పురుషులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ప్రతి పురుషుడు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు ఎవరికైనా సులభంగా పంపవద్దు. కోపంలో లేదా భావోద్వేగంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మార్చివేయొచ్చు. ప్రతి సంభాషణలో మర్యాద, గౌరవం పాటించండి. చట్టాల గురించి…
Read More
స్నేహితులు

స్నేహితులు

స్నేహితులు హే నందు మన మొబైల్ లో కొత్త యాప్ ఒకటి వచ్చింది చూసావా అంటూ అడిగింది శ్రావ్య అవునా లేదే నేను చూడలేదు ఇంతకీ ఏంటది అంటూ ఆసక్తి గా అడిగింది నందిని. అదా అది మనం అందులో స్నేహితులనూ పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో మన భావాలను పంచుకోవచ్చు మనం ఎవరో వారికీ తెలియదు కాబట్టి ఎన్ని విషయాలను అయినా ఏదైనా బాధగా ఉన్నా వారికీ చెప్పుకోవచ్చు. ఇలాంటివీ ఇంకా చాలా ఉన్నాయి అయినా ఇది చాలా సేఫ్ కూడా మన ఫోటో కూడా ఎవరికీ కనిపించకుండా పెట్టుకోవచ్చు అలాగే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటూ ఆగకుండా చెప్తూనే ఉంది శ్రావ్య. అవునా నువ్వు ఆ యాప్ వాడుతున్నావా మరి అడిగింది నందిని హ వాడుతున్నా నేనే కాదు మన ఆఫీస్ లో అందరూ వాడుతున్నారు అంది శ్రావ్య గొప్పగా నువ్వు కూడా చేసుకో నీ భావాలను పంచుకో, అందులో…
Read More
కనుమరుగవుతున్న బంధాలు

కనుమరుగవుతున్న బంధాలు

కనుమరుగవుతున్న బంధాలు హైదరాబాద్ నగరం మేల్కొనే వేళకు ఇంకా గంట ఉంది.అయినా బ్యాడ్మింటన్ కోర్టు లైట్లు వెలిగి ఉన్నాయి. తెల్లవారు ఝామున ఐదున్నర — ఆకాశంలో చీకటి ఇంకా సగం కరగలేదు, తూర్పు దిక్కున ఎర్రని చారలు ఒకటొకటిగా పాకుతున్నాయి. ఆ వెలుతురులో శిరీష చెట్టు ఆకులు చిన్నగా కదులుతున్నాయి — గాలి లేకుండానే, ఏదో కలలో ఊగినట్టు.వికాస్ కోర్టులోకి అడుగు పెట్టాడు.సంచి దించాడు. ర్యాకెట్ బయటకు తీశాడు. స్ట్రింగ్స్ ఒకసారి టచ్ చేశాడు — అలవాటుగా, ఏ ఆలోచన లేకుండా. తర్వాత నెట్ అవతలకు చూశాడు.అక్కడ ఎవరూ లేరు.ఆ కోర్టు అంతా ఖాళీగా ఉంది — నాలుగు గీతలు, ఒక నెట్, రెండు స్తంభాలు, మరియు వెలుతురు. అంతే.అతను ర్యాకెట్ తిరిగి సంచిలో పెట్టలేదు. కింద కూర్చున్నాడు. గోడకు జారగిలబడ్డాడు.ఆరు నెలల క్రితం ఇక్కడ నలుగురు ఉండేవాళ్ళు.విజయ్ ముందు వచ్చేవాడు. వికాస్ వస్తే "లేటు!" అని అరిచేవాడు. రాజేష్ హడావిడిగా…
Read More
కుట్ర

కుట్ర

కుట్ర ద్వారకాన్ని పరిపాలిస్తున్న విజయుడు. కొన్ని రోజులు క్రితం విజయుడు అడవికి వేటకి వెళ్ళినప్పుడు శత్రుదేశం వాళ్ళు చంపేశారు. దాంతో విజయుడికి వారసుడు లేకపోవడంతో తానే రాజ పరిపాలన చేయాలి అనుకుంది అన్నపూర్ణ. అదే సమయంలో శత్రుదేశం అయిన ప్రతాప్ వర్మ వాళ్ళ ద్వారక మీద యుద్ధం ప్రకటించడంతో... ప్రతాప్ వర్మతో రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నానని లేఖ పంపించింది అన్నపూర్ణ. ఆ లేఖ ప్రతాప్ వర్మ ద్వారక రాజ్యానికి ఒకరోజు అతిథిగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే సందేశం లేఖ ద్వారా పంపించాడు. ఆ లేఖనే చదివిన అన్నపూర్ణ వెంటనే ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. పేరుకి అన్నపూర్ణ అయిన తన చేతి వంట తింటే సాక్షాత్తు అన్నపూర్ణ దేవి వచ్చి వంట చేసి మాకు పెడుతుందేమో అని అనుకుంటారు ఊరి ప్రజలు. రాజ్యానికి ఎవరు వచ్చినా వాళ్లందరికి భోజనం పెట్టి మరి పంపించేది అన్నపూర్ణ. తనకి పేద , ధనిక…
Read More