టెక్నాలజీ
టెక్నాలజీ చిన్నా లేదు పెద్దా లేదుఅందరికీ ఈ టెక్నాలజే ముద్దురాత్రీ లేదు పగలూ లేదుఆటలకు అసలు హద్దే లేదు! చుట్టూ చీకటి ముసిరినానిద్ర అనేది రానే రాదుటైం ఎంత గడిచినా ఆకలనేధ్యాసే ఉండదు! కళ్లల్లోకి జుట్టు పెరిగినాఫోన్ మాత్రం వదిలేదే లేదుచదువు కోవాలని ధ్యాస లేదుఅమ్మ అరిస్తే వినేదీ లేదు! స్నేహితులంటే ఎవరు వారుఫోనుంటే చాలు నేడు శరీరానికివ్యాయామం లేదు గది లో బంధీలేఈ రోజుల్లో ని పిల్లలు! ఒకరిద్దరే ఇంటికి పిల్లలువారేదడిగితే అదే వద్దనేది లేదుగారాబం తో కొంత టెక్నాలజీ తోమరింత వారి భవిష్యత్తే వింత! ఉమాదేవి ఎర్రం