Thriller Storys

అన్వేషణ ఎపిసోడ్ 6

అన్వేషణ ఎపిసోడ్ 6

అన్వేషణ ఎపిసోడ్ 6 అసలే దుఃఖంలోనున్న నాకు, ఆ తర్వాతి రోజు వాళ్ళమ్మ గారు కనిపించారు. దగ్గరకు వెళ్ళి పలకరించబోతే, "ఛీ.. ఛీ.. నీ మొహం నాకు చూపించకు. నువ్వొక అనాధవని తెలిసి కూడా నా కూతురిని నీకిచ్చి కట్టబెడదామనుకుంటే, ఇంత దారుణానికి ఒడిగట్టి, తనని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందయ్య...! ఇంకా ఏం కాకుండానే పరాయి వాళ్ళతో కులుకుతున్నవ్ అంటే, రేపు పెళ్ళైయ్యాక నేరుగా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తావేమో?. అప్పుడు నా కూతురి బ్రతుకేం కావాలి. పెళ్లికి ముందే ఇలాంటి నీ గుట్టులన్నీ నా కూతురి కంట పడేట్టు చేసి, ఆ దేవుడు మాకు ఒకింత మేలే చేశాడులే. మేము డబ్బు లేనోల్లేమే కానీ, నీలా సంస్కారం లేనోల్లం కాదయ్యా..! అయినా ఏ దిక్కైనా ఉంటేనే కదా!, బంధం విలువ బంధుత్వం విలువ తెలిసేది. మా ఉసురు పోసుకుని ఇంతకింత అనుభవిస్తావ్ చూడూ..." అంటూ ఆవిడ కూడా నేను చెప్పేదేది వినకుండా…
Read More
అన్వేషణ ఎపిసోడ్ 5

అన్వేషణ ఎపిసోడ్ 5

అన్వేషణ ఎపిసోడ్ 5 అసలీ సంధ్య ఎవరో? సత్య కిరణ్ విషయంలో ఎందుకు తను అలా చేసిందోనని..? అన్వేషించే పనిలో పడ్డాము నేను, సత్య కృష్ణ. తనపై పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకపోయింది. సత్య కిరణ్ ని పోగొట్టుకున్న దుఖం నుండి కోలుకోవడానికి మాకు చాలా సమయమే పట్టింది. జరిగిన సంఘటన నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న నాకు... మరొక పిడుగులాంటి, హృదయాన్ని ముక్కలు చేసే వార్తొకటి తెలిసింది, అదే సత్య కాంత్ భార్య సుకన్య గురించి. సత్య కాంత్ ఉద్యోగరీత్యా దేశపు సరిహద్దులలో ఉండడంతో, వాడి భార్య ఇక్కడే ఒంటరిగా ఉండేది. వాడు మాత్రం సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చి వెళ్తుండేవాడు. మధ్యలో తనకేదైనా అవసరమైతే, ఒక అన్నలాంటి వాడిగా నేను తన బాగోగులు చూసుకునేవాడిని. అనాధైన తనని పెళ్ళిచేసుకుని, తనకి ఒక తోడుగా నిలిచిందని వాడు తనని చాలా బాగా చూసుకునేవాడు. వాడికి జీతం పడగానే వాడి…
Read More
అన్వేషణ ఎపిసోడ్ 4

అన్వేషణ ఎపిసోడ్ 4

అన్వేషణ ఎపిసోడ్ 4 అలా నేను, సత్య కృష్ణ ఆ డైరీని ఇంటికి తీసుకొచ్చి, మొదటి పేజీ నుండి దానిని చదవడం ప్రారంభించాము.  "ఎప్పుడూ నా స్నేహితుల దగ్గర ఏ విషయం దాచకుండా ప్రతీ విషయాన్ని వాళ్ళతో పంచుకునే నేను, తన గురించి విషయం దాచి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది. కొన్ని కోట్ల కలలతో, లక్షల ఆశలతో IES అవ్వాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ లో చేరిన నాకు, ఎప్పటిలాగే నా చదువు, ఏకాగ్రతతో తప్ప మరే ధ్యాస లేకుండా సాగిపోతుంది. అప్పటికే రెండున్నరేళ్ల గడిచాయి. ఇంకొక సంవత్సరం ఇలాగే కష్టపడితే, రాబోయే అల్ ఇండియా గేట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి, నా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఉవ్విళ్లూరుతున్న రోజులవి. అలా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి తను వచ్చింది. ఆ రోజు తెలియలేదు నాకు, తన స్వార్థానికి నా జీవితం నాశనమైపోతుందని. తన పేరు సంధ్య. ఇంజనీరింగ్లో ఇద్దరం క్లాస్మేట్స్. అప్పటికే కాలేజ్…
Read More
అన్వేషణ ఎపిసోడ్ 3

అన్వేషణ ఎపిసోడ్ 3

అన్వేషణ ఎపిసోడ్ 3 అలా తను ఆ పుస్తకం మొదటి పేజీ తీస్తుంటెనే తనకి అర్థమైంది అదొక డైరీ అని. ఆ డైరీ లో ఇలా రాసి ఉంది... "నా పేరు సత్య కుమార్, సత్య కిరణ్, సత్య కృష్ణ, సత్య కాంత్ అనే ముగ్గురు నా స్నేహితులు. ప్రాణ మిత్రులు కూడా... యాదృచ్చికమో ఏమో, అనాధలైన మా జీవితాలని ఆ బ్రహ్మ దేవుడు ఒకే పేజీలో రాసాడేమో అన్నట్టు మేమందరం ఒకే చోట (ఆ అనాధశ్రమంలోనే) పడ్డాం. మా పేర్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉండేవి. ఏ తోడు లేని మాకు ఒకరికొకరని తోడునందించింది ఆ అనాధశ్రమమే. ఊహ తెలిసిన దగ్గర నుండి, అందరం అక్కడే పెరిగాము. మా స్నేహ బంధం చూసి అన్నదమ్ముల బంధం కూడా దిగదుడుపే అన్నట్టనిపించేది అక్కడున్నవాళ్ళకి. తల్లిదండ్రులు, బంధువులు లేకపోయినా చదువుల్లోనే కాదు ఆటపాటల్లోనూ, సంస్కారోల్లోనూ మేము అందరికన్నా ముందు ఉండేవాళ్ళం. ఇక మా మధ్య మాత్రం ఎప్పుడూ…
Read More
అన్వేషణ ఎపిసోడ్ 2

అన్వేషణ ఎపిసోడ్ 2

అన్వేషణ ఎపిసోడ్ 2 ఒకపక్క మొదటి జరిగిన హత్య కేసు కోర్టులో విచారణలో వుండగానే, వరుసగా జరుగుతున్న ఈ హత్యలు నివారించడం పోలీసు వారి వల్ల కాకపోవడం, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య కేసులన్నీ చేధించడానికి కోర్టు, చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని నియమించింది. ఆరుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ బృందానికి సారథ్యం వహిస్తున్నాయన పేరు ఏసిపి రంజిత్ కుమార్. కేసుని టేక్అప్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఏసిపి రంజిత్ కుమార్ సారథ్యంలో గల ఆ సీఐడీ టీమ్ ముమ్మరైన దర్యాప్తు చేపట్టింది. కేసులను మరింత లోతుగా విశ్లేషిస్తూ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ప్రణాలికలు రచించడంలో నిమగ్నమైంది ఆ బృందం. మరొక ప్రక్క ఆ మూడు హత్య కేసులలో దొరికిన ఒకే ఒక్క క్లూ (సత్య అని రాసున్న కాగితం)ని కూడా ఆ సీఐడీ వాళ్ళు నమ్మలేక పోయారు. కారణం, హంతకుడు ఆ…
Read More
అన్వేషణ ఎపిసోడ్ 1

అన్వేషణ ఎపిసోడ్ 1

అన్వేషణ ఎపిసోడ్ 1 ఆ రోజు ఆదివారం, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ పరిధిలోనున్న పోలీస్ స్టేషన్ కి ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. "హలో..! సార్ ..! సార్..! జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ ఆ అండి ! హా.. అవునయ్య (ఆ రాత్రి డ్యూటీలోనున్న కానిస్టేబుల్ బదులిచ్చాడు) "ఇక్కడ ... ఇక్కడ... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, లక్ష్మి విలాస్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 333 (అడ్రస్ కల్పితం) లో ఒకావిడని అతి దారుణంగా చంపేశారు సార్! మీరు త్వరగా ర్ర.. ర్ర.. ర్రండి సార్! (కొంచెం కంగారు పడుతూ తడబడుతున్న స్వరంతో)" అంటూ విషయం చెప్పి సడెన్గా కాల్ కట్ చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి. అది విన్న కానిస్టేబుల్ తన పై అధికారులకు సమాచారమివ్వడంతో, హుటాహుటిన ఆ అజ్ఞాత చెప్పిన అడ్రెస్స్ కి బయలుదేరి వెళ్ళారు ఆ పోలీసు వారంతా. వాళ్ళు అక్కడికి చేరుకునే…
Read More