Trending Now

అబ్బో ఎండలు

అబ్బో ఎండలు

అబ్బో ఎండలు అబ్బబ్బ ఏం ఎండళ్రా అబ్బాయిసుబ్బరంగా ఇంటిపట్టున ఉండాల్సిందేడబ్బారేకుల సుబ్బారావు రొప్పుతూ సుబ్బిశెట్టి డబ్బాకొట్టు చేరెఈ డబ్బులు తీసుకుని డబ్బెడు కొబ్బరినీళ్ళు ఇవ్వుసుబ్బిశెట్టి ముఖం గుబ్బలు దిబ్బలా ఉబ్బెఈ మంటలకు తన పబ్బం గడుస్తోంది ఎబ్బెట్టుగా నైనాసుబ్బారావు దబ్బుమని గూడగుడా తాగె కొబ్బరినీళ్ళుఅది అబ్బురపరిచి సుబ్బిశెట్టి గబ్బు గుబ్బలెగిరేసెజబ్బునపడతావోయ్ సుబ్బారావు ఈ మబ్బుల ఎండల్లో తిరక్కునిబ్బరంగా కూర్చున్న గబ్బు సుబ్బీడబ్బులు ఊరికే వస్తాయా నీలా దబ్బపండులా దిబ్బలా కూర్చుంటేసుబ్బిశెట్టి ఇకఇక మంటూ ఏం దెబ్బకొట్టావోయ్ సుబ్బారావుమా అబ్బాయి పరీక్షలు నన్ను అబ్బబ్బ బలే ఇబ్బంది పెడుతున్నయోయ్ సుబ్బీనిబ్బరంగా కూర్చోనివ్వట్లేదు నించోనివ్వట్లేదు బొబ్బట్లలా ఒళ్ళంతా పేలిపోతోందిడబ్బులు ఇచ్చి పోలీసన్నలకు డబ్బెడు కాపీ చీటీలిస్తే నన్ను దెబ్బలుకొట్టి మా వాడికి ఆ డబ్బా ఇచ్చి ఇటురాకన్నారుఉబ్బితబ్బిబ్బయి నేను ఏడ్వాలోడబ్బా అందిందని ఉబ్బిపోవాలో చెప్పు సుబ్బీదబ్బదబ్బ ఇంటికెళ్లి సబ్బు అరిగే దాకా ఒళ్ళు తోముతా సుబ్బీ ఇక ఉంటా!! అపరాజిత్
Read More
ఆ!!వె!!🕉️🪷🚩 కం!!🚩🕉️🪷

ఆ!!వె!!🕉️🪷🚩 కం!!🚩🕉️🪷

ఆ!!వె!!🕉️🪷🚩 పాఠశాల స్థితిని పరిపుష్టి చేయంగప్రజలు భాగమైన పరిఢవిల్లు!అందుబాటులోన అధికారులున్ననువిలువ బెరుగు కృష్ణ వృద్ధిజెందు!! తాత చేతిలోన తారాడు చుండునుపశుల కాపరి కడ వరలు చుండు!గురువు చెంత నుండి గుణవృద్ధి జేయునుదీనిభావమేమి తెలుపుకృష్ణ!! కం!!🚩🕉️🪷 చని శ్రీలంకకు మారుతికని సీతను చెట్టుకింద కడుమోదముతోవినిపించి రామనామముననియెను రాఘవుని బంటునని వేగిరమున్!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
సహజ స్వరూపాలు,,,,,,!

సహజ స్వరూపాలు,,,,,,!

సహజ స్వరూపాలు,,,,,,! పచ్చని ప్రకృతి వన్నెలారబోసుకుంటున్నట్లుచీకటయ్యింది జాబిలిని వెన్నెల కాయమని అడిగినట్లుమనోహర సుందర దృశ్యాలలో వేణువు ఆలపించినట్లునదీ సముద్రాల సంగమం దగ్గర చిన్నది నాట్యమాడినట్లులేడి పిల్లలు గంతులేసే అడవి ప్రాణం పోసుకున్నట్లుకొండల పైనుంచి బండలపైకి జాలువారుతూ జలపాతం దుమికినట్లుగుర్రపు స్వారీ చేసే యువకుడు తిరుగులేని యవ్వనంలో తొణికిసలాడినట్లుమాంసం తిని మత్తిలి పడుకున్న సింహం చిన్న అలికిడికే గర్జించినట్లుఆకాశంలో విహరిస్తున్న విహంగాలు సూర్యుడి లేత ఎండకు శోభిళ్లినట్లుప్రణయ దేవత ముందు మోకరిల్లిన పెళ్లైన కొత్త జంట కలలు పండినట్లునీవు శ్రావ్యంగా పాడే పాట నా గుండెలో ఏ మూలో పొక్కిలవుతున్నట్లుకొలనులో తామర పూవు చుట్టూ తుమ్మెద ప్రదక్షిణలు చేస్తున్నట్లుపర్వత శ్రేణుల గుండా బోయలు పల్లకీ మోస్తూ వెళుతున్నట్లునా హృదయానికి అయిన గాయానికి నీవు లేపనం అద్దినట్లుచలికాలం ఈదర గాలులకు శరీరం గజ గజ వణుకుతూ పగుళ్లు తేలినట్లుశ్రమజీవుల ఉడుకు రక్తంతో సమస్త భూగోళం తిరుగుతున్నట్లుబహుదూరపు బాటసారికి విశ్వ రహస్యాలు గోచరిస్తున్నట్లు!! అపరాజిత్
Read More
స్నేహితులు

స్నేహితులు

స్నేహితులు హే నందు మన మొబైల్ లో కొత్త యాప్ ఒకటి వచ్చింది చూసావా అంటూ అడిగింది శ్రావ్య అవునా లేదే నేను చూడలేదు ఇంతకీ ఏంటది అంటూ ఆసక్తి గా అడిగింది నందిని. అదా అది మనం అందులో స్నేహితులనూ పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో మన భావాలను పంచుకోవచ్చు మనం ఎవరో వారికీ తెలియదు కాబట్టి ఎన్ని విషయాలను అయినా ఏదైనా బాధగా ఉన్నా వారికీ చెప్పుకోవచ్చు. ఇలాంటివీ ఇంకా చాలా ఉన్నాయి అయినా ఇది చాలా సేఫ్ కూడా మన ఫోటో కూడా ఎవరికీ కనిపించకుండా పెట్టుకోవచ్చు అలాగే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటూ ఆగకుండా చెప్తూనే ఉంది శ్రావ్య. అవునా నువ్వు ఆ యాప్ వాడుతున్నావా మరి అడిగింది నందిని హ వాడుతున్నా నేనే కాదు మన ఆఫీస్ లో అందరూ వాడుతున్నారు అంది శ్రావ్య గొప్పగా నువ్వు కూడా చేసుకో నీ భావాలను పంచుకో, అందులో…
Read More
నవ్వుల నాగయ్య

నవ్వుల నాగయ్య

నవ్వుల నాగయ్య ఒక ఊరిలో నాగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు? కానీ , ఒక గొప్ప సంపద మాత్రం ఉండేది , అదే అతని చిరునవ్వు! ఎప్పుడూ నవ్వుతూ ఉండటంతో…? ఊరంతా అతడిని నవ్వుల నాగయ్య అని పిలిచేవారు.ఒకరోజు నాగయ్య కొత్తగా కుట్టించుకున్న గులాబీ రంగు చొక్కా వేసుకుని బజారుకు వెళ్లాడు. అతని నవ్వు చూసిన వారందరూ,"ఏమయ్యా నాగయ్య! లాటరీ తగిలిందా?" అని అడిగారు."లాటరీ కాదు రా బాబూ! మా ఆవు నన్ను ఈరోజు తన్నలేదు!" అన్నాడు నాగయ్య.అంతలో టీ దుకాణం దగ్గరకు వెళ్లి,"ఒక టీ ఇవ్వు" అన్నాడు.టీ తాగి డబ్బులు ఇవ్వకుండా బయలుదేరాడు. టీ దుకాణం యజమాని,"అయ్యా! డబ్బులు…!" అని అరిచాడు.నాగయ్య వెంటనే జేబులో చేతిపెట్టి,"అయ్యో! డబ్బులు ఇంట్లో మర్చిపోయాను. కానీ , నా నవ్వు చూసి ఒక టీ ఉచితంగా ఇవ్వొచ్చుగా!" అన్నాడు."నీ నవ్వుతో కడుపు నిండితే బాగుండేది!" అన్నాడు దుకాణదారుడు.అప్పుడు…
Read More
(అ)ధర్మచక్రం -కథానిక

(అ)ధర్మచక్రం -కథానిక

(అ)ధర్మచక్రం -కథానిక ​ప్రభుత్వ కార్యాలయం అంటేనే అవినీతికి నిలయం అని ముద్రపడిన ఆ ఆఫీసులో వెంకట్రావు ఒక విచిత్రమైన పాత్ర. అందరూ 'పై' సంపాదనతో విలాసాలకు అలవాటు పడితే, వెంకట్రావు మాత్రం తనకున్న జీతంతోనే తృప్తిగా జీవించే ఒక సామాన్య మధ్యతరగతి జీవి. అతని అమాయకత్వాన్ని చూసి ఆనందరావు అండ్ కో ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేవారు. ​ఒకరోజు ఆనందరావు తన సహచరులతో కలిసి వెంకట్రావుని హేళన చేస్తూ, "ఏంటో వెంకట్రావు గారు! ఈ కాలంలో కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా? లోన్ కట్టి, ఈఎంఐల కోసం జీవితాన్నే పణంగా పెడుతుంటే.. మేమేమో ఫామ్ హౌస్‌లు, విలాసవంతమైన కార్లతో కాలక్షేపం చేస్తున్నాం. బతకడం చేతకాని వాడికి సమాజంలో గౌరవం ఉండదు తెలుసా?" అన్నాడు. ​వెంకట్రావు చిరునవ్వుతో, "ఆనందరావు గారూ.. ఆ ఈఎంఐ కట్టేటప్పుడు కలిగే ప్రశాంతత, రాత్రి పడుకున్నప్పుడు వచ్చే గాఢ నిద్ర దేవుడిచ్చిన వరం. మీరు సంపాదించే అక్రమ ధనం…
Read More
కన్నుల కలల పుస్తకం,,,,,,!

కన్నుల కలల పుస్తకం,,,,,,!

కన్నుల కలల పుస్తకం,,,,,,! కరిగిన కలలు లతలు లతలుగాకనుపాపలలో ఎగబాకుతూ,,,,,రంగు రంగుల పూల పరిమళాలుఆనందాల లోగిలిలో అరుదైన సన్నివేశంపుస్తకం నిండా చిత్రాలు విచిత్రాలే!కనురెప్పల మాటున సముద్రాలుముసురుకుంటున్న కారుమబ్బులుమధురమైన మకరందాల కోయిల పాట!ఎర్ర గులాబీల చిక్కని ఎరుపు రంగుఆకాశంలో మలిసంధ్య సూరీడు తలంపు!నేత్రాలు పూవులైన గుభాలింపులుచిరునవ్వులు పూసిన మల్లియలు!పోటీలు పడ్డట్లు జల జల దూకుతున్న జలపాతాలుఅశోక వృక్షాల సాక్షిగా కొండల మధ్యకోనేటి నీళ్ళలో ఈదుతున్న చేపపిల్లలు కళ్ళు!మనస్సు ఒక అద్బుత గ్రంధంప్రకృతి అందాలు లేక అది శూన్యంమీగడ తరగలు తీయని మాటలుఅక్షరీకరణలో అద్భుతం ఆవిష్కృతం!సన్నజాజులు నీ వాల్జడలో గుసగుసలుకళ్ళు మనసు పేజీలు తిరగేస్తూ నక్షత్రాల చమక్కుల ఆనందం!! అపరాజిత్
Read More
ఇచ్ఛాపురపు రామచంద్రం

ఇచ్ఛాపురపు రామచంద్రం

ఇచ్ఛాపురపు రామచంద్రం ఇచ్ఛాపురపు రామచంద్రం ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. ఆయన సావిత్రి బాయిపూలే ట్రస్ట్‌ సలహాదారు, ఆంధ్రప్రదేశ్‌ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్త.ఈయన విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో సత్యవతి, వైద్యనాథం దంపతులకు 1940, జూన్ 16న జన్మించాడు. బి.ఎ. (ఎకనామిక్స్‌) చదివాడు. వృత్తిరీత్యా 1968 నుండి జీవితభీమా సంస్థలో పనిచేసి 2000 సంవత్సరంలో అనకాపల్లి బ్రాంచి ఆఫీసులో పదవీవిరమణ చేశాడు. తరువాత విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందాడు. కాశీమజిలీ కథలను అనువాదం చేశాడు. బాలసాహిత్యంలో 40నుంచి 50 వరకూ పుస్తకాలు రాసిన ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ఆయన కథలు వందకుపైగా ప్రచురితమయ్యాయి.దారి పక్క దీపాలు (కథా సంపుటం)సిద్ధార్థ (కథా సంపుటం)సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి : సరళ సుందర పౌరాణిక ఉత్కంఠ కథా సంగ్రహముభట్టి…
Read More
మల్లాది రామకృష్ణశాస్త్రి

మల్లాది రామకృష్ణశాస్త్రి

మల్లాది రామకృష్ణశాస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి (1905- 1965) తెలుగు రచయిత.వచన రచనకు మేస్త్రీ - మల్లాది రామకృష్ణ శాస్త్రి. ఆయన విశ్వమానవుడు. వసుధైక కుటుంబకం అనే భావన మదినిండా బలీయంగా కలిగిన మహనీయులు. మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేదవిద్యను, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్యా నరసింహశాస్త్రి గారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. మొదట మచిలీపట్నంలోనే స్థిర నివాసం. తర్వాత కొంతకాలంపాటు గుంటూరులో కాపురం. 15వ ఏట పురాణం సూరిశాస్త్రి గారి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కొడుకులిద్దరికీ ఒకరికి తండ్రిపేరు…
Read More
నా దేవత

నా దేవత

నా దేవత నిన్ను చూసిన తొలి చూపులోనేమనసులో ప్రేమ అనే విత్తనం మొలకెత్తిందినువ్వు నా పక్కన ఉంటే పల్లకిలోవిహరిస్తున్నట్లు వుంటుంది నువ్వు మాట్లాడే మాటలు కోయిల పాడేపాటల్లాగా తియ్యగా ఉన్నాయినువ్వే నా దేవత అని గుండెల్లో గుడికట్టాను చివరికి గుండెల మీద తన్నావునువ్వు నాకు మాత్రమే సొంతం అనుకున్నానుచివరికి నా ఆశలన్ని సమాధి చేసావునీతో జీవితాన్ని గడపాలనే ఊహలన్నిoటిని బూడిదపాలు చేశావుగా… అనిల్ 🖊️
Read More