చావు

చావు

చావు

ప్రామిసరి పత్రం కాదు

తీర్చలేని బాకీ

జన్మను అప్పిచినవాడు

మృత్యువును పంపాడు

మిత్తిని తీసుకరమ్మని

వడ్డీ కడుతూ

బతుకును ఎంత లాగినా

అసలు మట్టికి కట్టాల్సిందే

ఎగొట్టలేని ఋణం

ఎన్నాల్లకైనా , ఎక్కడున్నా

పంచభూతాలకు చెల్లించాల్సిందే

కుదువ పెట్టుకోకుండా

ఊపిరిని నీ ఖాతాలో జమ చేశాడు

గడువు ముగిసింది

ఇచ్చేయాల్సిందే.

– రాంబంటు

Related Posts