చదువు – సంస్కారం

చదువు – సంస్కారం

చదువుతో పాటు సంస్కారం
అబ్బాలని నియమమేమి లేదు

చదువు సంస్కారం నేర్పుతుంది
అంటారు కానీ……..

సంస్కారం మనిషికి వన్నె తెచ్చే
ఆభరణం లాంటిది

ప్రతి వ్యక్తికీ వ్యక్తికి మధ్య సమయాన్నిబట్టి నడుచుకునేదే
మనిషి సంస్కారం

వింతపోకడల వినూత్న ప్రపంచంలో సవాలుగామారింది
సంస్కారం అనేది

మనిషి మనిషిగా దిద్దు కొనేది
మంచి నడవడిక మాత్రమే
సంస్కారం

వివేకంతో మాట్లాడినా
విజ్ఞానంలో మునిగి తేలినా
సంస్కారం మన కర్తవ్యం

విశ్వ విద్యాలయాలు పాఠాలు
నేర్పి పట్టాలు ఇచ్చినా
స్పందించే హృదయంలోనుండి
వస్తుంది సంస్కారం

పరిస్థితులను బట్టి పాటించే
నడవడికే సంస్కారం
పాటించకుండా రాదు అది
సమాజంలోని మనిషికి

చదువు ఒక్కటే సరిపోదు
జీవితానికి అనే సత్యాన్ని గ్రహించి
సంస్కారం లేని చీడపురుగులు గా కాకుండా సమాజానికి మనమిచ్చే కానుక సంస్కారము ….?

– జి జయ

Related Posts