చైతన్య దీపికలు

చైతన్య దీపికలు

ఓటమి ఒప్పుకొనప్పుడు వాదన ఎందుకు
వాదన చేసినప్పుడు ఓటమికి వాదనెందుకు
ఉండాలనీ లేనప్పుడు ఉండడం ఎందుకు
వెళ్లాలని అనుకుంటే అపెదేవ్వరు,
నిజాన్ని ఒప్పుకోనప్పుడు బ్రతకడం ఎందుకు
సమాజాన్ని ప్రభావితం చేయనప్పుడు
ధర్నాలు దీక్షలు ఎందుకు, ఒక్కరినైనా
మార్చనప్పుడు మనిషిగా గౌరవించనప్పుడు
పాలన ఎందుకు, పాలకుడు గా ప్రజల ధనాన్ని
దోచుకుంటూ, ప్రజా నాయకులము అని
గగ్గోలు పెట్టడం ఎందుకు, అవసరమున్నప్పుడు
మాత్రమే గుర్తొచ్చే రచయితలు ఎందుకు
గుర్తింపు లేని రచనలు ఎందుకు, గుర్తింపు లేదని
ఆగిపోతే ముందు తరాలకు మార్గ నిర్దేశం చేసేదెవ్వరు
ఓటమికి భయపడకుండా, సమాజం ఏమనుకున్నా
నాయకులు వంచించాలని చూసినా, పలికే గొంతును
ముగించాలని వెంటాడినా, మనిషిగా గౌరవించక పోయినా
ప్రశ్నించడం నా హక్కు, నా స్వేచ్ఛను బంధించాలని చూసినా
నా రెక్కలు విరచాలనుకున్నా, నా మనోభిష్టాలన్ని తొక్కాలని చూసినా తారా జువ్వనై,

గానమై, ప్రపంచాన్నీ మేల్కొలిపే శక్తినయి,

సమాజాన్ని ప్రభావితం చేసే మార్గ నిర్దేశనమయ్యి లోకమంతా గళమెత్తి శ్వాస నాళాలు తేగెలా
దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలను చైతన్య దిపికలు చేస్తాను.
ఆది శక్తిగా మారి శతృవులను చెండాడుతాను, మరో ప్రపంచపు కొత్త దారికి మార్గాన్ని సుగమం చేస్తాను. మరో ప్రభంజనమై ఎదురొడ్డి నిలుస్తాను….

– భవ్య చారు

Related Posts