"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

చలిమంట

చలిమంట

చలిమంటలా జ్ఞాపకాలు
జ్వలిస్తుంటే
ఆవలిస్తున్న మనసుకు కీ ఇచ్చి
రివైండ్ మోడ్ లో ఉంచాను

కుప్పపోసినట్టు పాతవాళ్ళందరు
ఒక్కచోట చేరిన అనుభూతి!
కాలం పుప్పొడిలా కంటతడి
కానుకై గుండె నిమురుతోంది

కట్టె కాలిపోయాక బూడిదైపోయిన ఈ ‘నేను’
ఎవరిని చూసి మాట్టాడుతుంది
బతుకు పరిమళాన్ని పారబోయటం
మానేసి
బంధాలను నేయటం చివరిలోన్నా నేర్చుకుందాం
తప్పొప్పుల చిట్టాను చలిమంట చేద్దాం

– సి. యస్ .రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *