చామంతి వనము!!

చామంతి వనము!!

దూర తీరాలకు
దరిచేర అలవకు.
చేయి దూరంలో ఉన్నదే
నీ గమ్యమని యెంచు …!

ముళ్ళ పొదల్లో జొచ్చి
మూర్ఖుడవై మూల్గకు
చెంతన ఉన్న మార్గము
చేమంతి వనము……!

సుఖాలకు మరిగిన
నీకు దుఃఖమే మిగులు.
దుఃఖాలను నెఱింగిన, అవి
నిన్ను వ్యక్తిగా నిలుపును…..!

చుట్టాల చట్రంలో చిక్కకు
యోధుడిగా చట్రాన్ని తిప్పు.
నీవు మహాసముద్రాన్ని అనుకుంటే
మరుగున పడెదవు.
మరుగున ఉన్న చలమ కి
చాలును వేళ్ళ గునపాలు.

నడువు నీకు భూమి ఆధారము
గాలిలో నడిచిన పడెదవు
చివరకు అక్కడే నువ్వు……!

అడవిలోన ఫల వృక్షానివై వెలుగు.
గాలి వనాలలో పూల మొక్క వై
గుబాళించు…………..!

నీలోని నువ్వు
ఎవరో కాదు………!
నమ్ము దాన్ని
అది నీ అంతరాత్మ….!
వమ్ము చేసిన దాన్ని,
జొచ్చి మూల్గుదవు
ముళ్లపొదల్లో న….!

– వాసు

Related Posts