చరవాణి మాయ ప్రపంచం

చరవాణి మాయ ప్రపంచం

మనం పంజరంలో ఉన్నాం
చరవాణి చేతిలో పెట్టుకుని దానిలో మునిగిపోయి
చెవులకు ఇంపుగా పాటలు వింటూ
ఆ చరవాణిలో మునిగిపోయి పంజరం అనే ఇంట్లో
బందీగా ఉంటూ
ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని విధానంగా ఉంటూ
చుట్టూ ఉన్న స్నేహితులను పట్టించుకోకుండా
చరవాణిలో ఉన్న ముక్కు , మొఖం లేని వాళ్లతో స్నేహం చేస్తూ
బయట ఆడుకోవలసిన ఆటలను చరవాణిలో ఆడుకుంటూ
నీ సమయం వృధా కాలక్షేపం చేస్తూ
ఒక లక్ష్యం లేకుండా
నిన్ను నువ్వే పంజరంలో బందీగా చేసుకుంటూ
పక్షులు ఉండవలసిన ఆ పంజరంలో
ఈ మనుషులు ఎందుకు ఉన్నారో అని
ఆశ్చర్యంగా చూడగా
మేమే ప్రపంచం మొత్తం తిరిగి సాయంత్రానికి
మా గూడుకు చేరుతాం…
మేము ఉండవలసిన పంజరంలో
ఈ మనుషులందరూ చరవాణి అనే మాయలో
పడి
కాలాన్ని , జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అని పక్షులు అనుకుంటున్నాయి…
పంజరం తలుపు తీస్తేనే పక్షులు స్వేచ్చగా ఎగిరిపోతాయి..
అలాంటి పంజరం తలుపు తీసుకుని స్వేచ్చగా బయటికి రావాలి అని కోరుకుంటున్నా..
చరవాణి మాయ ప్రపంచం నుండి బయటకు వచ్చి
స్వేచ్చగా ఉండాలని అనుకుంటున్నా..

– మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *