చరిత్ర సృష్టించు
రాజు ఒక ప్రైవేటు స్కూలులో టీచరుగా పనిచేస్తున్నాడు. అతను చిన్నప్పటి నుంచీ బాగాచదివేవాడు. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం వచ్చింది.వెంటనే పెళ్ళి చేసుకున్నాడు.ఇప్పుడతనికి ఇద్దరు పిల్లలు.అతనికి 47ఏళ్ళ వయసులో
జ్ఞానోదయం అయ్యింది. సరిగ్గాఅతని పుట్టినరోజు నాడు ఉదయం అతనిలో మనసులో ఒక అలజడి మొదలైంది.
ఏమిటీ జీవితం చూస్తుండగానే ఏభై ఏళ్ళు దగ్గర పడ్డాయి. ఏదోతిన్నామా,పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు బ్రతికేబ్రతుకూ ఒక జీవితమేనా. చరిత్రలో తన పేరు చిరస్థాయిగా గుర్తుండే విధంగాఏదైనా చేయాలని నిర్ణయంతీసుకున్నాడు. అంతే తనకుఇష్టమైన రచనా వ్యాసంగాన్నిమొదలుపెట్టాడు అనేక కధలు, కవితలు వ్రాసాడు. ప్రజలమన్ననలు పొందాడు. తర్వాతయూ ట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి అనేక వీడియోలు అప్లోడ్చేసాడు. గూగుల్ లోకల్ గైడుగా ఎన్నో ఫొటోలను అప్లోడ్ చేసాడు.
తర్వాత నాటకాలు వ్రాసి,డైరెక్టు చేసి ప్రదర్శించేవాడు. ఫేస్బుక్,ఇన్షాగ్రామ్ లో చురుకుగాఉండేవాడు. ఒకవైపు ఉద్యోగధర్మం నిర్వర్తిస్తూనే తీరిక సమయంలో రచనలు చేస్తున్నాడు. అంతేకాక దూరప్రాంతాలకు బైకువేసుకుని ఎండ్వంచర్రైడ్సు చేస్తున్నారు. ప్రతిరోజు ఇదే తన ఆఖరురోజు అన్నట్లుగా ఏదోఒకటి చేస్తున్నాడు.
నేటి పిల్లలకు ఆదర్శంగా నిలిచివారికి ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. అతని ఈ ప్రయాణం ఆగదు. అతని కట్టె కాలేవరకూ
నిరంతరం కొనసాగుతుంది.చరిత్ర సృష్టించాలి అని అతనుడిసైడ్ అయ్యాడు. అతను తప్పక సక్సస్ అవుతాడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని