చరిత్ర

చరిత్ర

కాల గర్భంలో గతించిన
సమాజపు విషయాలు
అన్నీ చరిత్రకే అంకితం

కోతి రూపం లోనుండి
మానవుడు రూపాంతరం
మానవ చరిత్ర
కృత, త్రేతా, ద్వాపర , కలి
యుగాల కదలిక కాల చరిత్ర

వ్యవస్థ ల మార్పు చేర్పులు
కాలాను గుణంగా వచ్చిన
స్వతంత్రదేశాల చరిత్ర

కాలక్రమేణా కరిగిపోయిన
విలువల వటవృక్షం
ఆదునిక చరిత్ర

శాసనాల శపధాలు
ప్రజల మధ్యన పడి వున్న
పరిచయాలు
నాయకుల చరిత్ర

మేల్కొలిపే మార్గాలు
అణచి వేసిన ముద్రలు
స్వాతంత్ర్య సమరాలు
ఉద్యమ చరిత్ర

నిరంతరం నిస్వార్డంతో
మనుగడకోసం నిలిచిన
మహానుభావుల చరిత్ర

అన్వేషణ ఆగకుండా
అందరికోసం ఆరాటం
వైజ్ఞాలికుల చరిత్ర

స్ఫూర్తి నే అక్షరాల పదాలు
అందించే సామర్థ్యం
తత్వవేత్త ల తార్కిక చరిత్ర

తనకు తానుగా రచించిన
అనుభవాలఅనుసంధానం
వ్యక్తి చరిత్ర

తరతరాల తీరని కోరిక
మనిషికి కూడు గుడ్డ గూడు
ఇవి తీర్చడానికి ఇంత పెద్ద
చరిత్రా…….?

– జి జయ

Related Posts