చెదిరిన కల
మేఘాలలో తేలుతూ!
మధురానుభూతులకు లోనవుతూ!
ఊహలకతీతమైన
సప్త స్వరాల శబ్ద తరంగాలతో!
లయ విన్యాసాలతో!
నాట్య మయూరాల నడుమ!
కనువిందులు చేసే
కమనీయ దృశ్యాలను
తరించి పరవశిస్తూ
ఉర్రూతలాడే వేళ!
చెదిరిన కలతో!
కరిగిన సౌక్యంతో!
నేలకు చేరిన
సగటు జీవిని నేను!
ఆశల కలలను పొందే
ధనవంతుడను!
-రామగోపాల్ కొమ్ముల