చేదు

చేదు

చేదు అనగానే గుర్తు వచ్చేది వేప చెట్టు .

ముక్కోటి దేవతలు ఒక్క చెట్టులో వుంటారు అని అంటారు. అదే వేప చెట్టు
చేదుకు ఒక ప్రత్యేకత ఉంది

చేదు అనుభవాలతో తీయని అనుభూతులు
అందుతాయి అందరికి .

మా వేప చెట్టు కథ

చేదు అంటే వేప అంటారు
కానీ మా వేపచెట్టు మాత్రం
నాకు తీపి కన్నా ఎక్కువ విలువ కలది .

చల్లని గాలి నిచ్చింది
సేద తీరే వారికి హాయి నిచ్చింది.
ఆరోగ్యానికి నేస్తంలా వుంది
డాక్టర్ అవసరం లేకుండా
కాపాడింది. పండగల రోజులు అందరికి పూతనిచ్చింది చెట్టు కింద
వనభోజనాలు చేసేము
ఇంటికి అందాన్నిచ్చింది
బంధువుల మన్నన పొందింది పక్షుల కిల కిలా
రావాలను వినిపించింది
మా పిల్లలకు చెట్టు నీడన
ఆటలు ఇచ్చింది . అమ్మతల్లి అయినవాల్లకి
పొత్తిలి అయింది .
పల్లుతోముకోడానికి పుల్ల
అయింది. వాహనాలు పెట్టడానికి నీడ అయింది
అమ్మవారికి సాక పెట్టడానికి
గుమ్మానికి కొమ్మయింది
ఉగాది నాడు తోరణ మైంది
అన్నిటికీ మించినది ఒకటుంది.
కరోనా టైంలో ఔషదమైంది.
ఉగాది పచ్చడి లో షడ్రుచులు ఎలానో
మన జీవితం కూడా
అన్ని సమ్మేళనంగా
ఆటు పోటు ల జీవన నావ
అని చేదు తెలిపే సత్యం.

– జి. జయ 

Related Posts