చీకటి లోకం – ఇది కథ కాదు ఒకరి జీవితం

చీకటి లోకం - ఇది కథ కాదు ఒకరి జీవితం

చీకటి లోకం – ఇది కథ కాదు ఒకరి జీవితం

నా పేరు శ్రావణి. నేను హై స్కూల్ లో చదివేటప్పుడు మా ఎదురింటి చరణ్ అనే వ్యక్తిని ప్రేమిమించాను. 3 సంవత్సరాల తరువాత మా ఇంట్లో ప్రేమ విషయం చెప్పాను మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నేను, చరణ్ పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకున్నాము. నన్ను కని, పెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వ్యక్తితో జీవితం బాగుంటుంది అనుకున్నాను. 2 సంవత్సరాల తర్వాత మాకు ఒక పాప పుట్టింది. తన పేరు రాధిక. చాలా అందంగా వుంటుంది, బాగా అల్లరి కూడా చేస్తుంది.

కొన్ని రోజుల తరువాత చరణ్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎప్పుడూ నాతో కోపంగా వుంటున్నాడు. నన్ను దూరం పెడుతున్నాడు. ఎందుకు ఆలా చూస్తున్నాడో నాకు తెలియడం లేదు. కొద్ది రోజులకి నేను అడిగాను ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని. ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తరువాత తెలిసింది నా భర్త వేరే వాళ్ళతో అక్రమసంభందం పెట్టుకునాడు అని.

నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పిన నా భర్త వేరే వాళ్ళతో అక్రమసంభందం పెట్టుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. మా మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. అప్పుడే మాకు ఒక బాబు పుట్టాడు. వాడి పేరు రాహుల్. పిల్లల కోసం అయినా నా భర్త మారుతాడెమో అనుకున్నాను. కాని ఎటువంటి మార్పులేదు.

రోజులు గడిచేకొద్దీ నా భర్త వేరే అమ్మాయితో సినిమాలకి షికార్లకి ఎక్కువగా వెళ్ళేవాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదు. నన్ను పట్టించుకోవడం మానేశాడు. నా భర్త చేసే పనులు రోజు రోజుకి నా జీవితం మీద నాకున్న ఆశలను చంపేస్తున్నాయి. నా భర్తని వేరే అమ్మాయితో చూసిన ప్రతిసారి నా మనసు బాధతో క్రుంగిపోయేది. నాకు అండగా తల్లిదండ్రులు కూడా లేరు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని వుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని బాధ పడని రోజు లేదు.

నేను తెలిసి తెలియని చిన్న వయస్సులో తీసుకున్న నిర్ణయాలకి ఇప్పటికీ బాధ పడుతున్నాను.

మనం జీవితాన్ని పంచుకోవాలి అనే వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకొని తల్లిదండ్రులు అనుమతితో పెళ్ళి చేసుకోవాలి. పెళ్లి అయిన తరువాత ఎవరో ఒకరు తప్పు చేసినా తప్పనిసరిగా ఇద్దరూ బాధ పడాల్సిందే.. ఎంత బాధలో వున్నా …! మన బాధను పంచుకోవడానికి మనకంటూ ఒకరు వుండాలి. ఎంతటి సమస్య వచ్చినా మనకంటూ ఒక కుటుంబం వుండాలి. అలాంటి కుటుంబాన్ని నేను కోల్పోయాను.

ప్రస్తుతం కేవలం నా పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ జీవిస్తున్నాను…..

– M తిప్పేస్వామి

చిద్రిత హృదయం Previous post చిద్రిత హృదయం
అబద్ధం, నిజం Next post అబద్ధం, నిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *