చీకటి ప్రపంచం

చీకటి ప్రపంచం

చీకటి అనేది అందరిలో ఉంటుంది
కానీ నేను మొదట్లో ఉన్నప్పుడు
నేను చాలా బాధ పడ్డాను.
రోజులు గడిచే కొద్ది అలవాటు అయిపొయింది…
గమ్యం లేని మనిషిగా బ్రతికాను…
నాలో మార్పు కోసం ఎదురు చూస్తూ
నా గమ్యం ఏంటో తెలుసుకొని
చీకటి ఉన్న వెలుగుని చూస్తూ బ్రతుకుతున్నాను…
నాకు ఎలాంటి కోరికలు, ఆశలు కానీ లేవు…
కొత్త విషయాలను తెలుసుకుంటూ
కొత్త స్నేహాలతో ఇప్పుడిప్పుడే పువ్వు పుడుతూ
నవ్వడం మొదలు పెట్టుతుంది…
గతంలో తాను ఉన్న ప్రపంచం వేరు
ఇప్పుడు ఉంటున్న ప్రపంచం వేరు…
అసలు అనుకోలేదు తను చీకటి ప్రపంచంలో
ఉంటుందని
ఇప్పుడు మాత్రం ఆ చీకటి చూసి భయపడక
ఒక పేరు లేని బంధం లేకుండా బ్రతుకుతుంది…
అప్పుడప్పుడు కన్నీళ్లకు చెప్పలేను కదా…
అవి వస్తూనే ఉంటాయి..

⁠- మాధవి కాళ్ల

Related Posts