చీకటి రాత్రి

చీకటి రాత్రి

కొందరికి కలల రాత్రి ..
ఇంకొందరికి కల చెదిరే రాత్రి..
మరికొందరికి కల తీరే రాత్రి…
ఇలాంటి రాత్రిని చూసి భయపడే పరిస్థితి
ఒక ఆడపిల్లది.
అందరూ కలలు గంటూ కలలు తీర్చుకునే రాత్రి.. ఒక ఆడపిల్ల కల చెదిరిన రాత్రి…
నాకు నేనే తోడు.. ఏ చేయి నాకు సాయం చేయడం లేదు అని..

నేనే సమాజం లో ధైర్యంగా నిలబడాలి అని ముందడుగు వేసి బయటి ప్రపంచం లోకి అడుగుపెట్టి..

తన పని ముగించుకుని.. తన ఆశయాన్ని నెరవేరుస్తూ…

తిరిగి ఇంటికి బయలుదేరే రాత్రి ..
పడ్డాయి కళ్ళు దుర్మార్గులవి..
పడ్డాయి కళ్ళు లోకులవి కాకుళ్ళ…

పడ్డాయి దుండగుల చేతులు.. ఆడపిల్ల శరీరం తన హక్కు అయినట్లు బలవంతంగా…
రాలేదు ఏ చేయి ఆపగా .
రాలేదు ఏ చేయి ఎదురించగా ..
చూస్తుండగానే ఆ రాత్రి కాళరాత్రి అయింది ఆ ఆడపిల్ల కి..

ఆ రాత్రి విషం చిమ్మింది.. ఆ ఆడపిల్ల పై… విష నాగులు విష సర్పాలు ఆగంతకులు..

కలిసి ఒక ఆడపిల్ల బతుకుని చిదిలం చేసిన రాత్రి ఈ రాత్రి…
ఒక్కొక్కరికి ఒక్కో జ్ఞాపకాన్ని ఇచ్చే రాత్రి ఈ రాత్రి..

– వనీత రెడ్డీ

Related Posts