చెల్లీ సిరి

చెల్లీ సిరి

చెల్లీ సిరి

నేనూ 7త్ క్లాస్ చదువుతున్నపుడు స్కూల్లో టై బెల్ట్ తప్పనిసరిగా వేసుకొని రావాలి అనీ ఒక రూల్ ఉండేది.. ఆ రోజు నేనూ టై బెల్ట్ మరిచిపోయా..

నేనూ కొంచెం దూరంలో నా చెల్లీ కొంచెం దగ్గరలో స్కూల్ గ్రౌండ్ లో వెళుతున్నాము.. అక్కడ సార్ టై బెల్ట్ వేసుకొని రాని పిల్లలకు నిల్డౌన్ పినిష్మెంట్ ఇచ్చి చేతి అరచేతులకు స్టిక్ తో కొడుతున్నారు..

అది చూసిన నా చెల్లీ నా దగ్గరికి పరిగెత్తుకుంటు వచ్చి అక్క, అక్క నీ టై బెల్ట్ నేనూ వేసుకున్న తీసుకో నావి నా బ్యాగ్లోనే ఉన్నాయి ఇవి తీసుకోని నీవూ వేళ్ళు నేనూ నావి పెట్టుకొని వస్తా అనీ చెప్పి నన్ను ముందుకు పంపించింది…

సార్ నన్ను చెక్ చేసి క్లాస్రూంలోకి పంపించాడు.. నేనూ మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే లేదు…కానీ నా చెల్లీ నాకు అబద్ధం చెప్పి నాకు వచ్చే పనిషమెంట్ భరించిది..

ఆ సార్ ఆ పనిషమెంట్ సరిపోలేదు అనీ అక్కడ ఉన్న పిల్లలను మొత్తం ఇళ్లకు పంపించారు.. అప్పుడు మా ఇల్లు స్కూల్ కూ 2కిలోమీటర్లు..

రోజు స్కూల్ బస్లో వెళ్లి వచ్చేవాళ్ళము.. ఆ రోజు తను నాకు చేసిన సాయం అప్పుడు తెలీలా నాకు.. ఆఫ్టేర్నూన్ లంచ్ బ్రేక్లో తన కోసం తన క్లాస్ రూంలోకి వెళితే,

విషయం తెలిసి ప్రిన్సిపాల్ రూంకు పరిగెత్తుకుంటు వెళ్లి తను నాకు చేసిన హెల్ప్ గురించి చెప్పి మా ఇళ్ళు చాలా దూరం సార్. తనకు దారి కూడా తెలీదు. అనీ చెప్పి స్కూల్లో ఇంగ్లీష్ సార్ బైక్ మీద నా చెల్లిని వెతకడానికి వెళ్ళా..

దారి మధ్యలో మా నాన్న మా చెల్లిని బైక్ మీద ఎక్కించుకొని మాకూ ఎదురు వచ్చారు..

నాన్న పనీ మీద బయటకు వచ్చినపుడు నా చెల్లీ కనిపించింది. విషయం కనుకొని స్కూల్ దగ్గరికి వచ్చి గట్టిగా అడిగారు..
అప్పుడు నా చెల్లీ 5క్లాస్..

తను నన్ను కాపాడాలి అనుకుంది. కానీ దాని వల్ల తను ఎంత ఇబ్బంది పడిందో.. సమయానికి నాన్నకీ కనిపించింది కాబట్టి సరిపోయింది.. లేకపోతే నా చెల్లీ పరిస్థితి ఏంటి ఆ టైమ్లో.. అసలే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది…

అంత చిన్న వయసులో తను చేసిన త్యాగం నా దృష్టిలో చాలా గొప్పది.

ఇది నా జీవితంలో జరిగింది విషయం..

-కళ

నీ త్యాగ నిరతికి జోహార్లు Previous post నీ త్యాగ నిరతికి జోహార్లు
న్యాయమా Next post న్యాయమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close