చెల్లింపుల విల్లు

చెల్లింపుల విల్లు

మనసు గాయపడినప్పుడో
చికాకుల సంద్రంగా మారినప్పుడో
ఓ పాట.. ఓ కృతి.. ఓ ఆలాప్
మనలోని మౌనాన్ని హత్తుకుంటుంది
మంద్రంగా మనలో వ్యాపిస్తుంది

సప్తస్వరాలు స్వరరాగరంజితాలై
కలకూజితాలై కలతలను దూరం చేస్తాయి
అప్పటిదాకా ముడుచుకున్న మనసు విప్పారుతుంది
జడలువేసిన జ్ఞానేంద్రియాల జడత్వం జాడలేకుండాపోతుంది
జపం చేసినట్టు వళ్ళంతా తుళ్ళింత
అసహనాలకు దారి మళ్ళింపు
దేహానికో అనుభూతుల చెల్లింపు

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *