చేనేత కార్మికులు
ఓ చేనేత అన్నా……
వస్త్రములను అస్త్రముల వలే. అందంగా అల్లిననూ అన్నము దొరకపాయెనే..
ధర దరిచేరక ,వస్త్రము వదిలి వెళ్ళక ..
కూలిబాటు లేకపోతే కుమిలిపోతుంది ముగ్గము..
చేయుత లేకపోతే చెదిరిపోతుంది చేనేత జీవితం.
ఆకలిని బందించి ,కండరాలను కదిలించి
చెమటను చిందించిన , చేనేత వస్త్రాము చెంత చేరదు , కడుపు నిండదు.. జీవనం సాగదు
అలనాటి కుటీర పరిశ్రమల కళా నైపుణ్యం
ఈనాటి మర పరిశ్రమల ముందు కళాహీనమౌతూ
కనుమరుగౌతున్నను కనికరం లేకపాయెనే…
మర మగ్గముల ముందు చేనేత మగ్గముల
పగ్గములు మూగబోయెనే…
రారాజులను మురిపించిన వస్త్రములు
విదేశీయుల మన్ననలను పొందిన వస్త్రములు
వాడిపోయిన పూవులై వెలవెల పోతూ..
నీరు పోసేవారికై ఎదురుచూస్తున్నవి. చేనేత మగ్గములు. మల్లె మొగ్గలై…
చేనేతకు పూర్వ వైభవం పల్లవించాలంటే..
పత్తి పంట పండాలి అధికంగా…
అందమైన కళకు ఆదరణ చూపి.,
అన్ని విధాలా చేనేత అన్నను ఆదుకుంటే .
అందమైన హరివిల్లు లాంటి వస్త్రములను
అస్త్రముల వలే అల్లుతాడు.
-గురువర్ధన్ రెడ్డి