చెరువు -కల్పతరువు

చెరువు -కల్పతరువు

మా ఊరి చెరువు -తలతల మెరయు
మా బ్రతుకు తెరువు -ఈ కల్పతరువు
మా చెరువు. నిండితే…

సాగు భూములకు -తాగు జీవులకు
జలచరాలకు -జగతి ప్రాణులకు
పాడి పంటలకు -పళ్ళతోటలకు
మత్స్యకారులకు -మనశ్శాంతికి
ఆటపాటలకు -ఆహ్లాదానికి
విహారయాత్రకు -విందులందుటకు
పొద్దు పొడుపులకు-పొద్దువిడుపులకు
ప్రగతి రథాలకు -పరిశ్రమలకు
పంచభూతముల-ప్రపంచ శాంతికి
కష్ట జీవులకు -కళ్యాణాలకు
లోకంవిడిచిన -సమస్తజీవికి

మా ఊరి చెరువు -మా కల్పతరువు

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా

– కోట

Related Posts