చెరువులో దెయ్యం

చెరువులో దెయ్యం

 చెరువులో దెయ్యం

 

వెంకట్ అనే 35 సంవత్సరాల ఒక యువకుడు అతని కుటుంబం చాలా పేద కుటుంబం ప్రతి రోజూ కూడా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు అతను ఒక్క ఒక రోజు చేపల వేటకి వెళ్లి తెచ్చిన చేపలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకు వాడుకునే వాడు అలాగే తన గ్రామంలో పెద్ద చెరువు ఉంది.

ఆ చెరువులో ఏ కాలంలోనైనా సరే నీరు సమృద్ధిగా ఉండటం వలన చేపలు లభిస్తూ ఉండేవి ఐతే ఆ చెరువులో ఎక్కువగా చేపలు పడుతూ ఉండేవాడు వెంకట్ పగటి పూట చేపల వేటకు వెళ్తే ఏమైనా అంటారని ఎక్కువగా రాత్రిపూట తన మిత్రులతో కలిసి అందరు పడుకున్న సమయంలో చేపల వేట సాగించేవాడు.

ఇది ఇలా ఉంటే వేరే వాళ్ళ చేనుకు కూలీగా వెళ్ళాడు వెంకట్ వెంకట్ తో పాటు మరో ముగ్గురు వరి చేను కొస్తు వుంటారు ఇక అప్పటికే సమయం మధ్యాహ్నం ఒంటగంట అవుతోంది ఎండ బాగ మండుతోంది. ఇంక ఇంటికి వెళ్దాం అనుకుని మరి తొందరగా చేను కోస్తు ఉన్నారు అంతలో అనుకోకుండా వెంకట్ చేతిలో ఉన్న కొడవలితో తన వేరొక చేతి వేలుని కొసుకున్నాడు

అలా చేతికి కొడవలి తగలడంతో వేలుకి రక్తం కారుతూ ఉంటే తనతోపాటు ఉన్న ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గాయానికి ఆకు మందు వేసి ఒక బట్ట తో రక్తం కారకుండా కట్టు కట్టారు అయిన లోతుగా గాయం అవడంతో రక్తం కారటం ఆగలేదు అది చూసిన వారు ఇక్కడ ఉంటే ఇంకా రక్తం ఎక్కువ అవుతుంది అని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ఆ ఊరిలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ నీ పిలిపించి తెగిన గాయానికి బాన్డేజ్ వేయించారు.

అయితే వెంకట్ కి బాగా గాయం అవడం వలన బాగా నొప్పిగా ఉంది అలా ఆ నొప్పితో పడుకోవడం జరిగింది అప్పటికి రాత్రి సమయం పదకొండు గంటలు అయ్యింది ఉన్నట్టుండి వెంకట్ నిద్ర నుంచి మేలుకొని చూసాడు తన స్నేహితుడు శ్రీరామ్ వచ్చి వెంకట్ నీ పిలిచినట్టు అనిపించింది వెంటనే వెంకట్ మంచం మీద నుంచి లేచి శ్రీరామ్ దగ్గరకి వెళ్ళాడు తర్వాత కొంచెంసేపు మాట్లాడుకుని రాత్రి పన్నెండు గంటలకి చెప్పాలా వేటకి చెరువు వైపు నడిచారు.

ఇది ఇలా ఉంటే వెంకట్ కి తనకి తగిలిన గాయం గుర్తు రాలేదు అలా ఇద్దరు చెరువుకి చేరుకుని చేపలు పట్టడం ప్రారంభించారు ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు చేపలు కూడా ఎక్కువ పట్టగలిగారు ఐతే వెంకట్ ఇంట్లో పడుకుని వున్న భార్య సుజాతకు ఒకసారిగా మెలుకువ వచ్చింది నిద్ర నుంచి లేచిన సుజాత తన భర్త పడుకుని ఉన్న మంచం వైపు చూసింది ఐతే తన భర్త వెంకట్ మంచం పై కనిపించలేదు.

ఇంక సుజాత ఇంట్లో అంతా వెతికి చూసింది కానీ ఎక్కడ కనిపించక పోయే సరికి తన అత్త మామలను నిద్ర లేపి వెంకట్ గురించి చెప్పింది వెంటనే సుజాత అత్త మామలు నిద్రలేచి ఇరుగు పొరుగు వాళ్ళని నిద్ర లేపి జరిగిందంతా చెప్పారు అప్పుడు వాళ్ళందరూ కలిసి వీది అంత వెతికారు కానీ వెంకట్ ఎక్కడ కనిపించలేదు అందరితో పాటు వెంకట్ స్నేహితుడు శ్రీరామ్ కూడా ఇంటికి వచ్చాడు ఎమైపోయాడో అని ఆలోచిస్తూ ఉండగా శ్రీరామ్ కి అనుమానం వచ్చి అతనికి తోడుగా మరికొంత మందిని తోడుగా తీసుకెళ్ళాడు.

వాళ్ళు రాత్రి సమయంలో చేపలు పట్టే చెరువు వద్దకు అయితే వాలకి ఆశ్చర్యం వేసింది దానికి కారణం ఏంటంటే అంత రాత్రి సమయంలో చెరువులో వెంకట్ ఒక్కడే చేపలు పడుతూ ఉన్నాడు పైగా మధ్యమద్యలో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడు అదంతా వాళ్ళు చూసి వెంకట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని వెంకట్ ను తీసుకుని ఇంటికి వెళ్ళడం జరిగంది అయితే వెంకట్ చేతికి ఉన్న గాయం మరింత పెద్దది అయ్యి బాగా రక్తం కారుతూ ఉంది అప్పుడు వెంకట్ భార్య వచ్చి చేతికి ఇంత గాయాన్ని పెట్టుకుని ఇంత రాత్రి సమయంలో ఒక్కడివే చెరువు దెగ్గరికి వెళ్లి చేపలు పట్టడం ఎంటి అని అడిగింది.

అలా సుజాత అనే సరికి ఇక సుజాత మాటలు విన్న వెంకట్ నేను ఒక్కడినే చెరువు దెగ్గరకు వెళ్ళడం ఎంటి నాతోపాటు శ్రీరామ్ కూడా వచ్చాడు అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీరామ్ వంక చూసి అదేంటి శ్రీ రామ్ మనతో ఉన్నాడు కదా వెంకట్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని అంత అనుకుంటున్నారు ఇక అప్పటి నుండి వెంకట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు అతని చేతికి ఉన్న గాయం కూడా రోజుకి ఒకలా పెరిగి అతను నరకాన్ని చుడాల్సి వచ్చింది ఎన్నో డబ్బులు ఎన్నో హాస్పిటల్స్ తిప్పిన సరే ఆ గాయం తగ్గినట్టు కనిపించడం లేదు.

వెంకట్ వల్ల తన కుటుంబ సభ్యులకి కూడా నిద్ర ఉండేది కాదు అందుకు కారణం ఏంటంటే శ్రీరామ్ నన్ను పిలుస్తున్నాడు నేను కూడా చేపల వేటకి వెళ్తానని మంచం పై నుండి లేచి చెరువు వైపు వెళ్ళిపోయేవారు అందువల్ల వాళ్ళు రాత్రి పూట నిద్రసరిపోకుండా కాపలా ఉండేవారు వెంకట్ కి అయితే ఆ తర్వాత రోజు నుండి నేను ఇంకొక మూడు రోజుల్లో చనిపోతానని ఎవరో నాకు చెప్తున్నారని చెప్పడం మొదలు పెట్టాడు వెంకట్.

ఇక వెంకట్ కుటుంబ సభ్యులు అతని మాటలకు భయపడుతూ ఒక రోజు ఒక భూత వైద్యుడిని ఇంటికి తీసుకు రావడం జరిగింది ఇతను సంధి అని ఒక భయంకరమైన దెయ్యనికి బలైపోయాడని నేను ఇతన్ని రక్షించలేనని అక్కడ నుండి లేవబోయాడు ఇక అలా భూత వైద్యుడు లేచి వెళ్ళిపోతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి అసలు వెంకట్ శరీరంలోకి ఆ శక్తి ఎలా ప్రవేసిచింది అని ఆడగా ఆ భూత వైద్యుడు ఇలా చెప్పా సాగాడు ఈ గ్రామానికి పడమర దిక్కున ఒక చెరువు ఉందని ఆ చెరువు దగ్గర ఈ సంధి అనేపడే దెయ్యం ఎప్పటి నుండో అక్కడ ఉంటుంది అని అయితే నిత్యం వెంకట్ అదే చెరువులో చేపలు పట్టడానికి వెళ్లేవాడని అతన్ని చూసి ఇతన్ని ఎలాగైనా బలి తీసుకోవాలని అనుకుంటూ ఉండేది.

అని కానీ అతన్ని బలి తీసుకోవడానికి సరైన సమయం దొరికేది కాదని ఇక సమయం కోసం కాచుకుని ఎదురుచూస్తూ ఉండేదని కానీ ఒక రోజు ఎం జరిగిందంటే వెంకట్ ఆ చెరువు కి ఉన్న కింద భాగంలో వారి చేను కోటకు వెళ్ళాడని చేను కాస్తూ ఉండగా తన చేతికి ఉన్న వేలుని కోసుకున్నడని అప్పుడు అతని చేతి గాయం నుండి రక్తం కారడం మొదలు అయ్యింది సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్న ఆ సంధి వెంకట్ చేతి నుండి కారే ఆ రక్తాన్ని చూసి అదే అదునుగా భావించి అతన్ని ఆవహించింది అని చెప్పాడు.

ఆ భూత వైద్యుడు ఇక ఆ రోజు నుండి వెంకట్ నేను చనిపోబోతున్ననని నా గురించి మీరు ఆలోచించి రక్షించే ప్రయత్నం చేయ్యోద్దు అని ఒక వేళ మీరు ఎంత ప్రయత్నించినా అవి ఎవి ఫలించవు అని కారణం ఏంటంటే ఆ దెయ్యం నన్ను కాచుకుని ఉంది. ఇప్పుడు కూడా నా పక్కనే కూర్చుని ఉందని నా వంక చూస్తోంది అని అంటూ ఆ మూడు రోజులు అలాగే అంటూ ఉండేవాడు ఆ మూడవ రోజు వెంకట్ మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి తన ఊపిరి విడిచిపెట్టాడు

– భరద్వాజ్

స్త్రీ  Previous post స్త్రీ
కూటమి Next post కూటమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close