చేతనగా చిగురుపడుతు…!!!

చేతనగా చిగురుపడుతు…!!!

తొలి వేకువతో తోరణమై…
పిలిచిన బంధాల సముదాయాన్ని
కూడగట్టుకొని అదోలోకంగా చూపక…!!
వినయ విధేయతలతో రూపమై
ప్రాధాన్యతలకు సూత్రమై కదలుతు…
ప్రలోభాలకు లొంగని మానవత్వం
పూచినదిగా వికాసాన్ని ఉత్తేజ పరుస్తు
వేచిన అడుగులతో నీ జీవితం
నేర్పుబడాలని…

త్యాగపు నిద్దుర మత్తులో…
పూడిపోయిన శాసనాల ధోరణిని
వదులుకొని…ఒడిగట్టిన ప్రకృతి బడిలో
నిత్య విద్యార్థిగా నేర్చుకొంటు…!!
ఉనికి కాదని ఉషస్సులతో నీలోని
ప్రతి పిలుపునకు తేజమై అనుకున్న
ఆశయాలు విధి విధానాలతో సాధింపు
బడాలని తలుస్తు…

ఎరుకతో చలనమవుతు…
నలుగురికి సాయపడే చేతులతో
సంఘానికి నిర్మాణమై
ప్రగతి సూర్యోదయంలో ఒక చేతనగా
చిగురు పడుతు…!!
పోరాటం కాని బతుకున తలచిన
సమయం దొరకని అవకాశం కాదని…
అదొక ఆయాచిత వరమని కుదుటపడుతు…

నువ్వొక గెలుపునకు నాందివై…
వేచే ఎత్తులతో సాహసమవుతు…
నేర్చుకొన్న కాలగమనాలతో సాగిపోయే
సాహశీకురాలిగా అభ్యుదయమై…!!
అచంచలమైన వ్యూహకర్తగా నిన్నటిని
తలువక నేటిన వృధా కానివ్వకా…
సమరం కాని సంతులనాలతో
అబలగా కాక…సబలగా సాగిపోవాలని
కోరుకుంటు…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *