చేతులు
విప్పారిన ఆ చిట్టి చేతులు నేలను ముద్దాడుతాయి
ఆ చిన్ని చేతులు చెంబుని మోస్తాయి
ఆ చిన్ని చేతులు చీపురుతో నేలను ఉడుస్తాయి
ఆ చిన్ని చేతులు గిన్నెలు కడుగుతాయి
ఆ చిట్టి చేతులు నొప్పులు ఆపుకుంటాయి
ఆ చేతులు మరో చిన్నారిని ఆడుముకుంటాయి
ఆ చేతిలు గోరుముద్దలు తినిపిస్తాయి
ఆ చిన్ని చేతులు ఓదారస్తాయి
ఆ చిన్ని చేతులు మగాణ్ణి హృదిలో అలసట తీరుస్తాయి
ఆ చిట్టి చేతులు బిడ్డలను సాకుతాయి
ఆ చిన్ని చేతులు ఇంటికి వన్నె తెస్తాయి
అవసరం ఆ చేతులని ఎన్నో చోట్ల తిప్పుతాయి
ఆ చేతులు వంటల్లో ప్రావిన్యాం సంపాదిస్తాయి
ఆ చేతులు నలుగురి కడుపు నింపుతాయి
ఆ చేతులు కంప్యూటర్ పై నాట్యమాడతాయి
ఆ చేతులు కారు నడుపుతాయి
ఆ చేతులు విమనాలు నడిపిస్తాయి
ఆ చిన్నారి చేతులు అంతరిక్ష యానాలు చేస్తుంటాయి
ఆ చేతులు నృత్య ప్రదర్శనలో అరితేరతాయి
ఆ చిట్టి చేతులు టెన్నిస్ ఆడతాయి
ఆ చిన్నారి చేతులు తుపాకీ పట్టుకొని
తీవ్రవాదులను అంతం చేయడంలో ముందుంటాయి
ఆ చిట్టీ చేతులే బ్యాట్ పట్టుకొని
భారతదేశం పేరుని నిలబెడతాయి
అందుకే అందుకే ఆ చిట్టి చేతుల వెనక
ఒక జీవితమే దాగి ఉంటుంది
ప్రపంచమే ఆమె అంటే భారత మాత
పాదాలను ముద్దాడుతున్నాయి
అమ్మను మించినది సృష్టిలో ఏది లేదు
అక్కగా, చెల్లిగా, చెలీగా,తల్లిగా
హితురాలిగా, స్నేహితురాలిగా తన కర్తవ్యాన్ని
సక్రమంగా నిర్వర్తిస్తూ దేశానికి కీర్తినీ తెచ్చిపెడుతూ
ఎంతో వినమ్రతను చూపుతోంది
జయహో మాత జయహో 🙏
– భవ్యర్చన