చెవుల కింపు
చెప్పుడు మాటలు
చెవులకింపు
మనసుకి ఉల్లాసం
మంచి చెడు ఆలోచించ నీయదు
మనకి నష్టమేమో అన్న
ఆలోచన రానీయదు
అవతలి వారిక్కూడా
అత్యుత్సాహం
చివరికి మనం
బలై పోతే గాని
తెలియదు దాని ఫలితం
అదండి చెప్పుడు మాటలు
తెచ్చే చెడు ఫలితం
– మోటూరి శాంతకుమారి