చిగురాశ…

చిగురాశ…

“ఒకరోజు”..
పొద్దున్న లేవగానే….

నీకు ఫోన్ చేయను, మెసేజ్ చేయను…
ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఏం జరిగింది అనేది కూడా చెప్పను…
ఏం తింటున్నాను, ఎలా ఉంటున్నాను. అనేది కూడా చెప్పను…
ఎందుకో తెలుసా ఆరోజు…
పొద్దున్న లేవగానే నువ్వు నా పక్కన ఉంటావని….
ఆరోజు మొత్తం నువ్వు నాతోనే ఉంటావని…
ఎన్నో మైళ్ళ దూరాన్ని… నువ్వు చెరిపేసి.. నాతోనే ఉంటావు అని…
నా ప్రతి కదలికలో నాకు తోడుగా నిలుస్తావని…
ఆరోజు నుండి నా ప్రయాణం నీతోనే మొదలు అని….
చిగురించేను నాలో ఒక చిన్న ఆశ

– మేఘమాల

Related Posts