చిలక గోరింక

చిలక గోరింక

 చిలక గోరింక

ఇది ఒక పల్లెటూరి ప్రేమ కథ
అబ్బాయి పేరు మహేష్ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. రోజు కాలేజిలో చాలా మంది అమ్మాయిలు మహేష్ అందాన్ని చూడగానే పడిపోయే వాళ్ళు.

కానీ మహేష్ మాత్రం ఏ ఒక్కరితో మాట్లాడే వాడు కాదు. మహేష్ క్లాసులు బాగా విని చదువుకునే వాడు తనకి సహాయ గుణం ఎక్కువ ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారికి తనకు తోచినంత సహాయం చేసే వాడు కాలేజ్ టాపర్ గా నిలిచాడు.

అలా మన మహేష్ చదువులో దూసుకుపోతున్న సమయంలో ఒక అమ్మాయి కాలేజ్లో చేరింది. అమ్మాయి పేరు సంధ్య మహేష్ సంధ్య ఎక్కువ మాట్లాడుకునేవారు కాదు కానీ ఒక రోజు సంధ్య కంబైన్డ్ స్టడీస్ కోసం అడిగింది మహేష్ నీ మహేష్ ఒకే అన్నాడు.

అలా వీరు కొన్ని రోజుల వ్యవధిలోనే స్నేహితులుగా మారారు. అలా ప్రతి విషయంలో మహేష్ సంధ్యకి సపోర్ట్ చేసేవాడు మహేష్ సంధ్య అలా దగ్గరయ్యారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. ఒక పక్కన చదువుకుంటూనే ఇంకొక పక్క ప్రేమించుకుంటున్నారు.

అలా పరీక్షలు రానే వచ్చాయి ఇద్దరు పరీక్షలు రాసిన వెంటనే వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇంట్లో వారి ప్రేమ విషయం చెప్పారు.

కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో వారికి ఎం చేయాలో తోచలేదు. అలా అనేక సార్లు కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పాలని చూసారు. కానీ వారు ఒప్పుకోవటం లేదు.

ఇంక వీరు ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఒక రోజు రాత్రి బట్టలు అన్ని సర్దుకుని ఇంట్లో నుండి బయటకు వచ్చేశారు.

తర్వాత మహేష్ ఒక గుడిలో సంధ్య నీ పెళ్లి చేసుకున్నాడుఆ తర్వాత ఒక ఉద్యోగం సంపాదించి మహేష్ సంధ్యని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు.

ఎలా అంటే చిలక గోరింకలా వీరిద్దరూ ఒక గూటిలో గువ్వలు ఎంత ఆనందంగా ఉంటాయో అంత ఆనందంగా…

– భరద్వాజ్

గూటిలోని గువ్వల జంట Previous post  గూటిలోని గువ్వల జంట
ప్రపంచం మిథ్య కాదు Next post ప్రపంచం మిథ్య కాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close