చిన్న ప్రయత్నం-పెద్ద ఫలితం
ఒకోసారి మనిషి చేసే చిన్న ప్రయత్నం వల్లనే అతనికి గొప్ప ఫలితం ఇస్తుంది. వెంకట్ తన డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ నగరానికి
వెళ్ళాడు. అతనికి వెంటనే ఉద్యోగం రాలేదు. ఈ లోపుఖాళీగా ఉండకుండా ఇంగ్లీషు భాష నేర్చుకోవటానికి ఇంగ్లీషుక్లాసులకు వెళ్ళేవాడు. ఇది వరకు ఊర్లో ఉన్నప్పుడు అతనికి అంతగా ఇంగ్లీషురాదు. దానికి కారణం అతనుతెలుగు మీడియంలో చదవటమే. నగరానికివచ్చాక అతను చక్కగాఇంగ్లీషులో మాట్లాడటంనేర్చుకున్నాడు. దాంతోచక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. చివరకుఅందులో సెలక్ట్ అయ్యాడు.మంచి ఉద్యోగం వచ్చింది.ఇంటర్వ్యూలో డిగ్రీతో పాటుకమ్యూనికేషన్ స్కిల్స్ కూడాపరీక్షించారు. అందులో సెలక్ట్ అయ్యాడు. అదే గనుక అతనుఇంగ్లీషు నేర్చుకోకుండా గనుకఉండుంటే ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పడేవాడు.ఇప్పుడైతే ఇంగ్లీషు నేర్చుకుని
మంచి ఉద్యోగం సాధించాడు.
అతను చేసిన చిన్న ప్రయత్నంఅతనికి పెద్ద ఫలితాన్ని తెచ్చింది. ఈ రోజుల్లోయువత కమ్యూనికేషన్స్కిల్స్ పెంపొందించుకోవాలనిప్రయత్నాలు చేస్తున్నారు. అలాప్రయత్నం చేయటం కూడా చాలా అవసరమే.
-వెంకట భాను ప్రసాద్ చలసాని