"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

చింతలు లేని కుటుంబం

చింతలు లేని కుటుంబం

చిన్న కుటుంబం అంటేనే చింతలు లేని కుటుంబం అనేది ఈ రోజుల్లో అక్షరసత్యం. అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండటం అనేది చాలా కష్టం. అందరికీ సౌకర్యాలు అందుబాటులో ఉండాలంటే చిన్న కుటుంబాలే మంచిది. దూరంగా ఉన్నా కూడా అవసరమైతే అందరూ కలుసుకుని మాట్లాడుకోవచ్చు. పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపించవచ్చు. మనయొక్క ఎదుగుదలకు మనం చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు.

సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తమకు ఇష్టమైన రంగాల్లో రాణించి మంచి పేరు, చాలా డబ్బు సంపాదించి తోటి కుటుంబ సభ్యులకు సహాయం చేసి తద్వారా వారి ఎదుగుదలకు కూడా కారణం అవవచ్చు. మనుషులకే కాదు మొక్కలకు మధ్య దూరం ఉంటేనే అవి సక్రమంగా పెరుగుతాయి. అన్నీ దగ్గర- దగ్గరగా నాటితే అవి సరిగ్గా ఎదగవు. కుటుంబంలో మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అనేది నిజమే సుమా.

పూర్వం ఉమ్మడ కుటుంబాల్లో అందరూ ఒకచోట ఉండి వ్యవసాయం చేసి కుటుంబ పోషణ చేసేవారు. ఇప్పుడు అలా వ్యవసాయం చేసినా మొత్తం కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం లభించటం లేదు. అందుకే ఉదరపోషణార్ధం చాలా  ప్రదేశాల్లో స్ధిరపడటం జరుగుతోంది. అదృష్టం ఏమిటంటే ఇప్పుడు దూరంగా ఉన్నా ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడే చక్కగా మాట్లాడుకోవచ్చు.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *