చిరుమందహాసం

చిరుమందహాసం

ఓనల్లనాయ్యావేణుమాధవా
మాకోసమే నీ మందహాసం

మందహాసపుబృందావనం
పరికించే పదనిసలు

చూపునిలిపే హాయి
సున్నితతత్వపు చిరుగాలి

పెదవుల దరహాసం
చెక్కిళ్ళ నిండుతనం

మూర్తీభవించిన స్పందన
మురిపెపు అనుభూతి

హృదయపూర్వకఅభివాదం
తెలియచేసే వదనం

భాష కు సరిపోని భావం
వివరణ కోరని స్తుతులు

ముకుందా మురారీ
నీసుందరవదనారవిందమే
కమల నయనాల కారుణ్యం

నిను చూసిన చాలును
హృదయం ఉప్పొంగి
నాట్యమాడును

నీ వేణువు రాగాలు
దరహాసపు దండాలు

నీ మువ్వల సవ్వడి
మము పిలిచెను ప్రేమతో

మురిసిపోతిమిమేము
నీ చల్లనిదీవెనల తో

ఓ నల్లనయ్యా మము
బ్రోవుమయ్యూ

– జి జయ

Related Posts