చితికిన బతుకులు

చితికిన బతుకులు

చితికిన బతుకులు
చిరిగిన బట్టలు
బతికిన బతుకులు
చింపిన విస్తర్లు

అలసిన కనులు
విసిగిన మనసులు
తగిలిన గాయాలు
మరువవులే ఈ వ్యధలు

చలించని ఈ గుండెలు
వ్యర్థములే మొసలి ఏడుపులు!
అణగారిన ఈ బ్రతుకులు
అందరికీ కనువిప్పులు

మేలుకోవోయ్
నీకివే నా పిలుపులు!
అందరి కళ్ళుకు
కనిపించాలి నీలో నిప్పు కణికలు!

– గాయత్రీ భాస్కర్ 

Related Posts