చిత్రం

అప్పుడే పుట్టిన పసికందు చిత్రం

పారాడు పాపాయి చేష్టలు చిత్రం

చిట్టి అడుగులు చిత్రం

నేలపై జారే చినుకులు చిత్రం

మట్టివాసన చిత్రం

పక్షుల కిలకిల రావాలు చిత్రం

పావురాళ్ళ గూళ్ళు చిత్రం

ముడుచుకునే పువ్వులు చిత్రం

వికసించే నవ్వుల విచిత్రం

వరి పైర్లు చిత్రం

సెలయేరు గలగలలు విచిత్రం

కోయిల రాగాలు, పిచ్చుకల

కువకువలు చిత్రం, తుమ్మెద

గానం విచిత్రం తేనెపట్టు చిత్రం

ప్రకృతి కాంత పలు చిత్రాల

మేలుకలయిక చిత్రాలు

చూస్తున్న మన నయనాల

అదృష్టం….

– భవ్యచారు

Related Posts